ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న శోభాశెట్టి ఈటీవీ ప్రోగ్రాంలో ఎలా ప్రత్యక్షమైంది.. ?!

ప్రస్తుతం బిగ్‌బాస్‌ సీజన్ 7 రసవతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో బుల్లితెర స్టార్ బ్యూటీ శోభాశెట్టి ఓ కంటిస్టెంట్‌గా పాల్గొంది. 11 వారాల నుంచి బిగ్ బాస్ హౌస్ లోనే ఉంది శోభా. అయితే హౌస్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా బయటకు వెళ్లని శోభా శెట్టి తాజాగా ఈటీవీ ప్రోగ్రామ్ లేటిస్ట్ ప్రోమోలో దర్శనమిచ్చింది. దీంతో అందరూ అవాక్కవుతున్నారు. బిగ్‌బాస్ హౌస్ లోనే ఉన్న శోభ ఈటీవీ ప్రోగ్రాం లో ఎలా హాజరైంది అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన ఈటీవీలో ఆలీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆలీతో ఆల్ ఇన్ వన్ రియాలిటీ షో లో పాటిస్పేట్ చేసింది శోభాశెట్టి.

ఇక శోభాశెట్టి గేమ్‌లో పార్టిసిపేట్ చేసిన ఎపిసోడ్ నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.అయితే ఈ ఎపిసోడ్ అందరూ చూసేలా చేయడానికి ఈటీవీ ప్రోమో రిలీజ్ చేసి ఆకట్టుకుంది. ఈ ఎపిసోడ్‌కి శోభాతో పాటు మరో ఇద్దరు మెయిల్ సెలెబ్రిటీలు హాజరయ్యారు. వారి కంటే శోభాశెట్టినే మంచి పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఈ షోలో కూడా బిగ్‌బాస్ లాగానే కాస్త టెంపర్‌ను చూపించింది ముద్దుగుమ్మ. కాగా ఈ ప్రోమోలో శోభాశెట్టి చాలా రీసెంట్‌లుక్‌తో కనిపించింది. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న శోభా.. ఈటీవీలో ఎలా కనిపిస్తుంది అన్న డౌట్ సగటు బిగ్ బాస్ వీక్షకుడిలో మొదలైంది.

అయితే నిజానికి ఈ షో చాలా రోజుల క్రితం షూట్ చేసిన ఎపిసోడ్లను రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా శోభాశెట్టి ఎపిసోడ్ కూడా ఎప్పటిదో కానీ నవంబర్ 21న ప్రసారం చేయబోతున్నారు అని టాక్. ఏదేమైనా శోభాశెట్టి ఫాన్స్ కి ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఎప్పుడూ హౌస్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్ లకు చుక్కలు చూపించే ఈ బ్యూటీ.. ఈవారం నామినేషన్స్ లో ఉంది. ఇక బిగ్‌బాస్ అన‌ఫిషియ‌ల్ ఓటింగ్ లిస్ట్ ప్రకారం లీస్ట్‌లో ఉంది శోభా. అయితే ఈ వారం శోభాశెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.