” నా కన్నతల్లి డబ్బులకు ఆ మగవాడి పక్కలో పడుకోబెట్టింది “… బోల్డ్ బ్యూటీ షకీలా సెన్సేషనల్ కామెంట్స్…!!

టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ షకీలా గురించి మనందరికీ తెలిసిందే. ఈమె సినిమాలలో బోల్డ్ గా నటించి ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఈమె పేరు టైటిల్ లో ఉంటేనే ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ భయపడేది. ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరమైంది. ఇటీవల బిగ్ బాస్ షో కి వెళ్లి.. మరోసారి పలకరించింది. అలాగే కొన్ని టెలివిజన్ షోస్ సైతం చేస్తుంది. ప్రస్తుతం తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

షకీలా మాట్లాడుతూ…” నేను చిన్న వయసులోనే బలంగా కనిపించే దానిని.. నా వయసు కన్నా మించి నా హైట్ ఉండేది. అలాగే నేను హైస్కూల్లో చదువుకున్నప్పుడే కాలేజీ అమ్మాయిల ఉండే దానివి. దారిలో నన్ను చాలామంది ఓరకంగా చూసేవారు. అలా ఎందుకు చూస్తున్నారు నాకు అస్సలు అర్థం అయ్యేది కాదు. మా ఇంట్లో ఎప్పుడూ పేదరికంతో డబ్బు సమస్య ఉండేది. దీంతో మా అమ్మ మగవాళ్ళను పరిచయం చేసి వాళ్ళ గదికి వెళ్ళమని చెప్పేది. అందుకు నేను ఒప్పుకునే దానిని కాదు.. అందుకు మా అమ్మ ఆ విషయంలో బాగా కొట్టేది. దీంతో నాకు వేరే దారి లేక.. నోరు కట్టేసుకుని అమ్మ చెప్పినట్లు ఉండే దానిని ” అంటూ చెప్పుకొచ్చింది.

షకీలా ఇంకా మాట్లాడుతూ…. ” మా అమ్మమ్మ, అమ్మ కూడా ఈ విధంగా చాలా డబ్బు సంపాదించారు. నన్ను అదే దారిలో వెళ్ళమన్నారు. కానీ నేను సినిమాలు ఎంపిక చేసుకున్నాను. కానీ ఇక్కడ కూడా నా శరీరం కేవలం ప్రచారానికి మాత్రమే ఉంచేవారు. దాంతో నాకు చాలా బాధనిపించేది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉండే క్వాలిటీస్ నాకు ఉన్నాయి.. కానీ ఎప్పుడూ నన్ను ఐటమ్ గానే చూసేవారు. కెమెరా ముందు నన్ను తోలుబొమ్మలాటలా ఆడించేవారు ” అంటూ చెప్పుకొచ్చింది. ఇది విన్న ప్రేక్షకులు…” ఈమె లాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు. ఈమె చరిత్ర వింటేనే బాధేస్తుంది. ఈమె కన్నతల్లి అలా చెప్పిందంటే ఆమె ఎంతటి నీచురాలో తెలుస్తుంది. ఏదేమైనా షకీలా ఇప్పటికైనా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.