బోల్డ్ బ్యూటీ ఊర్ఫీ జావిద్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం జరిగిందంటే..?

బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఊర్ఫి జావిద్‌.. సీరియల్ యాక్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది. పలు హిందీ సీరియల్ లో నటించిన ఈమె తర్వాత బిగ్ బాస్ ఓటీటీ హిందీ సీజన్‌లో కంటెస్టెంట్ గా మారి కాస్త క్రేజ్‌ని దక్కించుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను ధరించే దుస్తులతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. బోల్డ్ అవుట్ ఫిట్ లో పబ్లిక్ లో తిరుగుతూ సందడి చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది.

ఇప్పటికే ఆమె ధరించిన దుస్తులపై ఎన్నో విమర్శలు వచ్చినా.. ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమైన.. ఈమె మాత్రం ఎవరిని పట్టించుకోకుండా.. తన పద్ధతి మాత్రం ఇప్పటికీ మార్చుకోలేదు. ఇప్పటికీ షాకింగ్ అవుట్ ఫిట్‌లో దర్శనమిస్తూనే ఉంటుంది ఇప్పటికే చాలాసార్లు ఆమె ఫ్యాషన్ అవుట్ ఫిట్, వేషధారణ పై చాలా కేసులు నమోదయ్యాయి. గత నెలలో బాంద్రా పోలీస్ స్టేషన్లో ఆమె ఎంచుకుంటున్న దుస్తులపై కేసు ఫైల్ చేశారు. అలా పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఊర్ఫిని తాజాగా ముంబై పోలీసులు కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇవాళ ఉదయం ఊర్ఫి కాఫీ కోసం బయటకు వెళ్ళింది. రెడ్ బ్యాక్ లెస్ టాప్, డెనిమ్‌ జీన్స్ ధ‌రించింది.

ఇక అప్పుడే అక్కడికి వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫిమేల్ పోలీసులు ఆమెను తమతో పోలీస్ స్టేషన్కు రావాలంటూ కోరారు. కానీ ఊర్ఫి ఎందుకు..? కారణం చెప్పాలంటూ వాళ్లను ప్రశ్నించింది. చివరిగా వారితో వెళ్లేందుకు అంగీకరించిన ఊర్ఫీ పోలీస్ వ్యాన్‌లో ఎక్కి పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది. ఈ వీడియో వైరల్ గా మారడంతో కొందరు ఇది ప్రాంక్ వీడియో అయి ఉండొచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిజంగానే పోలీసులు అరెస్ట్ చేశారా..? లేదా ప్రాంక్ వీడియోనా..? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.