దీపావళి మెరుపులను ఒంటికి చుట్టిన మిల్కీ బ్యూటీ.. మత్తెక్కించే స్టిల్స్ లో తమన్నా..

స్టార్ హీరోయిన్ తమన్నకు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్నేళ్లపాటు తెలుగు ఇండస్ట్రీలో టాప్ బ్యూటీగా కొనసాగిన తమన్న తన అందం, డ్యాన్స్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాలీవుడ్ అగ్ర హీరోలు అందరి సరసన నటించిన మిల్కీ బ్యూటీ తెలుగుతోపాటు అటు బాలీవుడ్ , కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ టాప్ హీరోయిన్గా రాణిస్తుంది. ప్రస్తుతం తమన్న సినీ కెరీర్ మంచి స్వింగ్ లో ఉంది. ఇప్పటికే కెరీర్ లో మంచి ప్లేస్ ను సాధించుకున్న తమన్నా అదే పొజిషన్ కంటిన్యూ చేయాలని సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది.

చివరిగా బాలీవుడ్ లో తెరకెక్కిన లవ్ స్టోరీస్ 2, జీ కర్దా లాంటి సినిమాల్లో సెన్సేషనల్ గా మారింది. బోల్డ్ పర్ఫామెన్స్ తో ఎవరు ఊహించని విధంగా రెచ్చిపోయింది. ప్రస్తుతం అదే హాట్ నెస్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెక్స్ట్ ఎలాంటి సినిమాతో తమన్న కనిపించబోతుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కూడా నెలకొంది. ప్రస్తుతం బాంద్రా సినిమాలో ఆమె నటిస్తుంది. అదేవిధంగా కాళీ దొరికినప్పుడల్లా అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.

ప్రస్తుతం బాంద్రా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటున్న తమన్నా ఎప్పటికప్పుడు నెట్టింట‌ కూడా హాట్ ఫోటో షూట్లతో సందడి చేస్తుంది. ఇక తాజాగా బ్లూ శారీలో మెరుపులు మెర్పించింది. దివినుంచి నుంచి దిగి వచ్చిన దేవకన్య లాగా మెరిసింది. దీపావళి మెరుపులను చీర రూపంలో ఒంటికి చుట్టుకున్నట్లుగా ఆమె కనిపించింది. బ్లౌజ్ మతి పోగొట్టే అందంతో చీర కట్టులో కుర్రాలను కవ్విస్తూ మత్తెక్కించే విధంగా ఫోజులు పెట్టింది. ఆ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అభిమానులకు ముందుగా దీవాలి శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.