ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అంతా ఇటు సినిమాలలో కొనసాగుతూ మరొకవైపు వ్యాపార రంగాల్లో రాణిస్తూ కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు. వీళ్లే కాకుండా వీళ్ళ భార్యలు సైతం అనేక రంగాల్లో రాణిస్తూ కోట్ల సంపాదిస్తున్నారు. మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, రానా, నాగార్జున, రామ్ చరణ్ వంటి హీరోలంతా కూడా మంచి బిజినెస్ రంగాలని నడుపుతున్నారు. వీరే కాకుండా వీరి భార్యలు సైతం హీరోల సంపాదనకు ఏమాత్రం తీసిపోకుండా సంపాదిస్తున్నారు. మరి ఈ స్టార్ హీరో భార్యలు ఎంత సంపాదిస్తున్నారో ఇప్పుడు చూద్దాం.
1. నమ్రతా శిరోద్కర్:
సూపర్ స్టార్ భార్య అయిన నమ్రతా పెళ్లి తర్వాత ఫ్యామిలీకే పరిమితమైంది. మహేష్ కమర్షియల్ బ్రాండింగ్ వ్యవహారాలను చూసుకోవడమే కాకుండా… ఏఎంబి సినిమాలతో పాటు టక్స్టైల్స్, ఫుడ్ బిజినెస్ లలో మహేష్ పెట్టుబడులను ఆమె చూసుకుంటుంది. వీళ్ళ ఇయర్లీ టర్న్ ఓవర్ కోట్లలోనే ఉంటుంది.
2. ఉపాసన:
దేశంలోనే అతిపెద్ద హాస్పిటల్స్ లో ఒకటి అపోలో. దీనికి డైరెక్టర్స్ లో ఒకరైన ఉపాసన రామ్ చరణ్ ని వివాహమాడింది. అయినప్పటికీ దీంతోపాటు ఎయిర్ లైన్స్ బిజినెస్, యువర్ లైఫ్ అనే హెల్త్ మాగజైన్, వెబ్ సైట్ బాధ్యతలను నిర్వహిస్తుంది. వీళ్ళ ఇయర్లీ టర్న్ ఓవర్ కోట్లలోనే ఉంటుంది.
3. అల్లు స్నేహ:
అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ తన అప్డేట్స్ ని పంచుకుంటుంది. ఈమె తండ్రి రాజకీయ నాయకుడు. ఈయన స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ గా ఉన్న స్నేహ.. ఓ ఫోటో స్టూడియోను సైతం నడుపుతుంది. వీళ్ళ ఇయర్లీ టర్న్ ఓవర్ కోట్లలోనే ఉంటుంది.
ఇలా తమకి ఇష్టమైన రంగాల్లో కొనసాగుతూ భర్తకి చేదోడు వాదుడుగా నిలుస్తున్నారు. వీరిని చూసి మరికొందరు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని.. ప్రేక్షకులు భావిస్తున్నారు. ఏదేమైనాప్పటికీ భర్తకు తగ్గ రంగాలలో రాణిస్తూ కోట్ల సంపాదిస్తున్నారు.