రీసెంట్ గానే హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటలీలో వీళ్ళ పెళ్లి మూడు రోజులపాటు ఘనంగా జరిగింది . దీనికి సంబంధించిన పిక్చర్స్ కూడా ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు మెగా ఫ్యామిలీ . అంతేకాదు వరుణ్ తేజ్ పెళ్లి తన ఇంట్లో ఆఖరి పెళ్లి కావడంతో నాగబాబు మెగా ఫ్యామిలీ లోని అందరికీ భారీ స్థాయిలో మర్యాదలు చేశారట .
అంతేకాదు ప్రతి ఒక్కరికి పట్టు వస్త్రాలతో పాటు గోల్డ్ ఐటమ్స్ అందజేశాడట . అయితే పెళ్లికి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రాలేదు. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా . పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య కూడా రాలేదు . ఈ క్రమంలోనే తమ తమ్ముడి కొడుకు కూతురుకి స్పెషల్గా గిఫ్ట్ ఇంటికి పార్సల్ చేశారట . అంతేకాదు రేణు దేశాయ్ కూడా చీరతో గిఫ్ట్ ప్యాక్ చేసారట.
ఇదే మెగా సాంప్రదాయం అంటే అంటూ కొందరు జనాలు మెగా ఫ్యామిలీ విషయాలను ట్రెండ్ చేస్తున్నారు. మరికొందరు ఆమెనే వద్దనుకున్నప్పుడు ఆమె బిడ్డలు మీకెందుకు..? అంటూ ప్రశ్నిస్తున్నారు . మరి కొందరు అసలు రేణు దేశాయ్ పెళ్ళికి రానప్పుడు మీరు ఇంత ఓవర్ యాక్టింగ్ చేయడం అవసరమా..? అంటున్నారు . దీనితో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది..!!
రేణు దేశాయ్ కి మెగా ఫ్యామిలీ అద్దిరిపోయే రిటర్న్ గిఫ్ట్.. మెగా సాంప్రదాయం అంటే ఇదేనా..?
