సూపర్ స్టార్ మహేష్ బాబు మనందరికీ సుపరిచితమే. ఈయన తన టాలెంట్ తో, కరెక్ట్ కథను ఎంచుకుంటూ సినిమా రంగంలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈయన ” గుంటూరు కారం ” షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కెరీర్ లో అనేక సూపర్ హిట్ లు ఖాతాలో వేసుకున్న మహేష్.. రానున్న కాలంలో ఇంకెన్ని బ్లాక్ బస్టర్ లు ఖాతాలో వేసుకుంటాడో చూడాలి. ఇక సూపర్ హిట్ సినిమాలను చేసిన ఈ హీరో చిన్న తప్పిదం వల్ల కెరీర్లో విమర్శలు ఎదుర్కొన్నాడు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన మల్టీ స్టార్ మూవీ ” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ” ఈ సినిమా సూపర్ హిట్ అయింది. వెంకీ – మహేష్ అన్నదమ్ములుగా ఈ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని ఒక సూపర్ హిట్ అందించాడని మరో సినిమాకి కమిట్ అయి ” బ్రహ్మాత్సవం ” సినిమా చేశారు. కానీ ఈ మూవీ మహేష్ కెరియర్ లో డిజాస్టర్ గా నిలిచింది.
శ్రీకాంత్ అడ్డాల నుంచి ఇలాంటి సినిమాని మేము అసలు ఊహించలేదంటూ.. మహేష్ ను యాంటీ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. కాగా మహేష్ బాబు కూడా ఈ మూవీ ఫలితం పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడట. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్… బ్రహ్మత్సవం మూవీ చేయడం నా ఖర్మ ” అంటూ మండిపడ్డాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.