మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్.. డైరెక్టర్ ఎవరంటే..?

రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవరసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడు ప్రభాస్. మొదటి చిన్న చిన్న సినిమాల్లో నటించిన ప్రభాస్.. ఈ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నాడు. తర్వాత వరుస హిట్ సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్న ప్రభాస్.. రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియన్ మూవీ బాహుబలి సిరీస్‌లు నటించాడు. సినిమా సూపర్ సక్సెస్ అందుకోవడం తో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటి ద‌క్కించుకున్నాడు. బాహుబలి సినిమా తర్వాత నుంచి ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు పాన్‌ ఇండియా లెవ‌ల్‌లో రిలీజ్ కావడంతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ ఊహించినా రేంజ్ లో ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు.

అయినా ప్రభాస్ క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గడం లేదు. దీన్ని బట్టి ప్రభాస్ మేనియా పాన్ ఇండియాలో ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ప్రశాంత్‌నీల్‌ డైరెక్షన్లో సలార్ సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు మారుతి.. ప్రభాస్ కాంబోలో మరో సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలు ఇంకా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ప్రభాస్. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరో అసలు ఊహించలేరు. అతనే మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.

ప్రభాస్ – త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా రాబోవుతుందంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. యూవీ క్రియేషన్స్, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌ సంయుక్తంగా త్రివిక్రమ్ – ప్రభాస్‌ల‌తో సినిమా చేయాలని భావిస్తున్నారట. వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై అధికారికి ప్రకటన రాలేదు. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్‌ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న గ్రాండ్ లెవెల్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది.