ప్రమోషన్స్ లో రణబీర్ కపూర్ ధరించిన ఈ వాచ్ ధర ఎంతో తెలుసా..?

గత కొద్దిరోజులుగా స్టార్ నటి నటుల గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీల డ్రెస్సింగ్ స్టైల్ నుంచి వాచ్ షూస్ గ్లాస్సెస్ ఇతర గ్యాడ్జెట్స్ కూడా చాలా వైరల్ గా మారుతూనే ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు సైతం వాచ్ కార్ కలెక్షన్స్ గురించి తరచూ ఏదో ఒక వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ గురించి ఒక విషయం వైరల్ గా మారుతున్నది.సౌత్లో రణబీర్ కపూర్ కు భారీ గాని ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

తాజాగా రణబీర్ కపూర్ నటిస్తున్న చిత్రం యానిమల్ ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రష్మిక హీరోయిన్గా నటిస్తూ ఉండగా డిసెంబర్ 1న ఈ సినిమా విడుదల కాబోతోంది దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం బిజీగా ఉంటున్నారు. ఇటీవలే ఒక ఈవెంట్లో పాల్గొన్నా రణబీర్ తన స్టైలిష్ లుక్ లో అందరినీ ఆకట్టుకోవడం జరిగింది.. ఈ క్రమంలోనే తను ధరించిన ఒక వాచ్ పాటెక్ ఫిలిప్ వాచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.

ఈ బ్రాండెడ్ వాచ్ ధర దాదాపుగా 72 లక్షల రూపాయలు ఉన్నట్లు సమాచారం. ఈ వాచ్ ప్రముఖ ఇన్స్టాగ్రామ్ హరాలజీ దగ్గర ఉన్నట్లుగా తెలుస్తోంది.. ఈ వాచ్ చాలా స్టైలిష్ గా కనిపించే పూతతో పాటు బంగారు నెంబర్స్ కలిగి ఉండడం గమనార్హం. ఈ వాచ్ కు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. చివరిగా బ్రహ్మాస్త్ర సినిమాలో కనిపించిన రణబీర్ ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by primedecoder (@prime.decoder)