పాయల్ ఆ ఒకే ఒక్క పని చెయ్యకపోతే…” మంగళవారం ” సినిమా డిజాస్టర్ అయ్యేది…!!

తాజాగా విజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ” మంగళవారం ” మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పంజాబీ ముద్దుగుమ్మ, క్రేజీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కథానాయకగా నటించి… ప్రేక్షకులని మెప్పించింది. ఇంతకముందు ఆర్ఎక్స్ 100 సినిమాలో బోల్డ్ పర్ఫామెన్స్ తో యువతను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ప్రస్తుతం మంగళవారం మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఓ ఊపు ఊపుతుంది.

దీంతో పాయల్ కెరీర్ ని తిరిగి చూసుకోవాల్సిన పని లేదనే చెప్పాలి. ఇక పాయల్ తాజాగా ఓ ఇంటర్వ్యూ కు హాజరై పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. పాయల్ మాట్లాడుతూ..” మంగళవారం సినిమాలో శైలు రోల్ కోసం 35 మందిని ఆడిషన్ చేశారు. అంతకు ముందే డైరెక్టర్ అజయ్ కు ఫోన్ చేసి నాకు అవకాశం ఇవ్వండి అని అడిగాను. ఆయన కొత్త హీరోయిన్ కోసం ప్రయత్నించారు. చిన్న చిన్న పాత్రలలో నిన్ను తీసుకోలేమన్నారు. తరచుగా కాంటాక్ట్ అవ్వడంతో చివరగా నన్ను సెలెక్ట్ చేశారు.

లేకపోతే ఈ సినిమా మిస్ అయిపోయేదాన్ని.. ఈ ఛాన్స్ ను దక్కించుకోవడం కోసం నెల రోజుల పాటు నా పాత్రకు సంబంధించి రీసర్చ్ చేసి దర్శకుడు కి కావాల్సినట్టుగా పెర్ఫామ్ చేశాను. షూటింగ్ తర్వాత నా స్కిన్ టోన్ కి కొన్ని గాయాలు మానడానికి 15 రోజుల టైం పట్టింది ” అంటూ పాయల్ చెప్పుకొచ్చింది. ఈమె కష్టానికి ప్రేక్షకులు తగిన ఫలితమే ఇచ్చారని చెప్పాలి. ఇక ఈమె వ్యాఖ్యలు చూసిన ప్రేక్షకులు..” కేవలం ఈ సినిమాలో పాయల్ ఆ పాత్ర చేయడం వల్లే ఈ సినిమా హిట్ అయింది. ఈమె నటన అంత బాగుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.