అక్కడ అలా అడుగుతూ.. ఆ హీరో ముందు పరువు పోగొట్టుకున్న సుమ…!!

అద్భుతమైన ప్రేమ కథతో తెరకెక్కిన ” సప్త సాగరాలు దాటి ” సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్‌గా ఈ సినిమాలోని హీరో రక్షిత్, హీరోయిన్ రుక్మిణి ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో సుమ హోస్ట్ గా చేసింది. ఇక ఈ నేపథ్యంలో హీరో సుమా పై బేబత్స‌మైన‌ జోకులు వేశాడు రక్షిత్.

” సప్త సాగరాలు దాటి సైడ్ ఎ, సైడ్ బి కథలు ముందే రాసుకున్నారా? అని సుమ రక్షిత్‌ను ప్రశ్నించగా.. రక్షిత్ దీనికి సమాధానం ఇస్తూ..” కథ రాసింది నేను కాదు హేమంత్. ఇక రెండు స్టోరీస్ ను కలిపి ఒకే సినిమాగా తీద్దామా ? అని ఓ రోజు హేమంత్ అడిగాడు. రెండు పాట్లుగా చేస్తే బాగుంటుందని చెప్పాను. అలా సైడ్ ఎ, సైడ్ బి గా తెరకెక్కించాము ” అని అన్నాడు.

మరి దీనికి నిర్మాత ఒప్పుకున్నాడా? అని సుమా ప్రశ్నించగా.. నేనే నిర్మాతను అని పంచ్ వేశాడు. ఇక సుమ మీరే హీరో, డైరెక్టర్, నిర్మాత, సింగర్ అని వర్ణిస్తుంటే ఇంతలో రక్షిత్.. నేను సింగర్ కాదని అన్నాడు. ఈ ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు… ” ఏంటి సుమా.. ఎంతో అనుభవం ఉన్న దానివి.. ఇలా దారుణంగా పరువు పోగొట్టుకున్నావ్ ఏంటి? ” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.