రామ్ చరణ్ ఇచ్చిన ఆ ఖరీదైన గిఫ్ట్.. వద్దని ఛీ కొట్టిన ఉపాసన.. పాపం చరణ్..!!

తెలుగు ఇండస్ట్రీ లో అందాల జంటలలో రామ్ చరణ్, ఉపాసన ఒకరు. వీరిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా జూన్ 20న పండంటి బిడ్డ పుట్టింది. ఇక సుమారు 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ తండ్రి కావడంతో మెగా ఫ్యామిలీ తో పాటు మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో సంబరపడ్డారు.

కాగా పాపకి ” క్లీన్ కారా ” అని పేరు కూడా పెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్… ఉపాసన పై సంచలన కామెంట్స్ చేశాడు. చరణ్ మాట్లాడుతూ…” ఉపాసన కోసం నేను ఐదు గంటలు వెతికి మరీ ఖరీదైన వాచ్ గిఫ్ట్ గా ఇచ్చాను.

కానీ తను మాత్రం ఐదు నిమిషాలలో.. నాకు వద్దంటూ రిజెక్ట్ చేసింది. ఒకవేళ అమ్మాయిలకు ఏదైనా వస్తువు కొని సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటే.. వాళ్లు.. అలా చేయకండి. వారికి ఏది నచ్చుతుందో ముందుగా తెలుసుకుని అది ఇవ్వండి ” అంటూ వెల్లడించాడు రామ్ చరణ్. ప్రస్తుతం చరణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.