స్పాట్‌లైట్‌లో అందాల జాత‌ర‌.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న అల్లు అర్జున్ బ్యూటీ..

చమ్మక్ ఛ‌ల్లో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది కేథరిన్. 2013లో రిలీజ్ అయిన ఏ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. అయితే అదే ఏడాది అల్లు అర్జున్‌.. ఇద్దరమ్మాయిలు సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాలేదు. కానీ ఆ మూవీలో కేథరిన్ లుక్స్, డ్యాన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. కుర్రాళ్ళు ఆమె గ్లామర్, ఎనర్జీకి ఫాన్స్ అయిపోయారు. డాన్స్ లో అల్లు అర్జున్ స్పీడ్‌ను కేథరిన్ కూడా బాగా క్యాచ్‌ చేసి తన పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ఇక తన గ్లామర్‌కు తగ్గట్టు సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఎన్నో అవకాశాలు వచ్చాయి.

అయినా ఆమెకు సక్సెస్ రాకపోవడంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. అయినా మరోసారి అల్లు అర్జున్ సరసన సరైనోడు సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమాలో లేడీ ఎమ్మెల్యే పాత్రను పోషించింది. ఇదే మూవీ లో యువర్ మై ఎమ్మెల్యే సాంగ్ అప్పట్లో పెద్ద హిట్గా నిలిచింది. ఇక కేథరిన్ అందరిలాగా స్లిమ్ బాడిని మెయింటెన్ చేయదు. కానీ బొద్దుగా ఉన్న తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

సరైనోడు తర్వాత కేథరిన్ నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక సినిమాలో నటించింది. చివరిగా టాలీవుడ్లో బింబిసారా, మాచర్ల నియోజకవర్గం, వాల్తేరు వీర ఎలాంటి సినిమాల్లో నటించి మెప్పించిన కేథరిన్.. ఎప్పుడు హద్దులు దాటి గ్లామర్ షో చేయలేదు. సహజసిద్ధమైన గ్లామర్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా కేథరిన్ స్పాట్‌లైట్‌లో ఎద‌ అందాలు చూపిస్తు షేర్ చేసిన పిక్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తే అందాలతో కేథరిన్ రెచ్చిపోయింది. ఇక ప్రస్తుతం కాథ‌రిన్‌కు కాస్త మంచి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి.