వైష్ణవి చైతన్య బెడ్ రూమ్ వీడియో అడిగిన జబర్దస్త్ కమెడియన్.. ఫైర్ అవుతున్న నెటిజన్స్..

బుల్లితెర‌పై జబర్దస్త్ కామెడీ షోకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కామెడీ షో ఎంతో మందికి జీవితాన్నిచ్చింది. ఈషో ద్వారా ఎంతో మంది స్టార్ కమెడియన్స్ గా పాపులారిటీ దక్కించుకున్నారు. ఇక ఈ షో అట్రాక్షన్ కోసం జనాలను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు కంటెస్టెంట్లకు మధ్య కాంట్రవర్సీ, లవ్ ట్రాక్లు ఇలా ఏదో ఒక క్లిప్‌ ను కట్ చేసి ప్రేక్షకులకు షోపై హైప్‌ పెంచడానికి చూస్తూ ఉంటారు. ఇక ఇటీవల ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమో ఒకటి రిలీజ్ అయి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బేబీ సినిమా హీరో వీరాజ్‌ అశ్విన్ ఈషోకు స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. దీంతో కమెడియన్ ఆయన్ను అడగకూడని ప్రశ్న అడిగాడు. ఇక ఇప్పటికే కామెడీ పేరుతో చాలాసార్లు ఈ షోలో కంటెస్టెంట్లు హద్దు మీరారు.

తాజాగా ఓ కమెడియన్ చేసిన పనికి హీరో తో పాటు జడ్జిలు, యాంకర్ కూడా షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇటీవల జబర్దస్త్ కామెడీ షో లో హద్దు మీరు కామెడీ చేస్తు వల్గర్ పంచలతో కూడా జనాలను నవ్వించే కంటెంట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంట్లో ఫ్యామిలీతో కలిసి ఈ షోను చూసేవారు కాస్త ఇబ్బంది పడేలా షోలో కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. కుళ్ళు జోకులు, డబుల్ మీనింగ్ డైలాగులతో ప్రజలను కూడా చిరాకు తెప్పిస్తున్నారు. ఇక తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ రిలీజ్ అయిన ప్రోమోలో ఓ క‌మెడియ‌న్‌ అందరికీ షాక్ ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి వందకోట్లు రాబట్టిన బేబీ మూవీ తో వైష్ణవి చైతన్యకు, ఆనంద్ దేవరకొండకు మంచి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ షోలో మరో హీరో వీరాజ్ అశ్విన్ స్పెషల్‌గెస్ట్ గా వచ్చాడు. జబర్దస్త్ కమెడియన్ ఇమన్యేల్‌ ప్రశ్న అడిగాడు. ఎలాగూ వచ్చారు కదా వైష్ణవి చైతన్య బెడ్ రూమ్ గంట వీడియో ఉందా ఉంటే ఫార్వర్డ్ చేయండి అంటూ అడిగాడు. అయితే ఏం చెప్పాలో అర్థం కాక వీరాజ్ సైలెంట్ అయిపోయాడు. ఇక అక్కడే ఉన్న జడ్జిలు కుష్బూ, కృష్ణ భగవాన్ తో పాటు యాంకర్ రష్మీ కూడా షాక్ అయింది. ఇక ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అస్సలు ఇటీవల కాలంలో కామెడీకి హద్దు లేకుండా పోతుంది, మితిమీరిన డైలాగ్లు వేస్తూ చీఫ్ ప్రశ్నలు అడుగుతూ అషోకు ఉన్న రేపిటేషన్ను పోగొట్టుకుంటున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.