అందంగా లేని అమ్మాయిని హీరోయిన్గా ఎలా తీసుకున్నారు..? అదిరిపోయే రిప్లై ఇచ్చిన డైరెక్టర్..!!

తాజాగా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో తరకెక్కిన మూవీ జిగర్తాండ డబుల్ ఎక్స్. రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో నిమిషా సజయాన్ హీరోయిన్గా మెప్పించింది. ఇక ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. పది రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వ‌సుళ‌ను రాబట్టింది. దీంతో ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు మూవీ టీం. ఇందులో భాగంగా ఓ రిపోర్టర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రిపోర్టర్ మాట్లాడుతూ సినిమాలో హీరోయిన్గా నటించిన నిమిషా అసలు అందంగానే లేదు.. తను బాగోక పోయినా సరే తనని సినిమాల్లోకి తీసుకొని ఆమె నుంచి ఇంత మంచి నటనను ఎలా రాబట్టారు అంటూ.. ప్రశ్నించాడు.

ఈ ప్రశ్నకు షాక్ అయిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. ఆమె అందంగా లేదని నీకెందుకు అనిపించింది.. నువ్వు ఎలా చెప్పగలవు.. ఒకరు అందంగా లేరని అనేయడం నువ్వు డిసైడ్ చేయడం చాలా తప్పు అంటూ వివరించాడు. డైరెక్టర్ ఆన్సర్ కు మూవీ టీమ్ అంతా చప్పట్లు కొట్టారు. ఇక ఈ సినిమాతో పాటు సక్సెస్ మీట్‌లోను భాగమైన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్‌ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదిక షేర్ చేసుకున్నాడు. ఇక ఈ విషయాన్ని షేర్ చేస్తు ఈ విధంగా రాసుకొచ్చాడు. నేను అక్కడే ఉన్నా.. అందం గురించి అతడు పిచ్చి ప్రశ్న అడిగి ఆపేయలేదు.. ఏదైనా వివాదాస్పద ప్రశ్నలు అడగడానికి చాలా ప్రయత్నించాడు.. అలాంటి ప్రశ్నలు అడిగేసాక తను చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు అంటూ వివ‌రించాడు.

తొమ్మిదేళ్ల క్రితం జిగర్తాండ మొదటి భాగం వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో.. ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఏమాత్రం మారలేదు అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన వ‌మీషా సజయాన్ ఇప్పటికే పలు సినిమాల్లో నటించి తన సత్తా చాటుకుంది. గతంలో సిద్ధార్థ హీరోగా వచ్చిన చీత సినిమాలో కూడా ఈమె నటించింది. అయితే ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె అంత బాగా నటిస్తుంది.. ఎంతో చక్కగా ఉంది.. అందంగా లేదనడానికి.. అలా అవమానించడానికి వాడికసలు బుద్ధి లేదు అంటూ.. ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.