” కచ్చితంగా అలాంటి చర్యలు తీసుకోపోతే ఈ మగవాళ్లు అస్సలు భయపడరు ” .. మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్..!!

స్టార్ హీరోయిన్ త్రిషపై ప్రముఖ నటుడు మాన్సూర్ ఆలీ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ” లియో ” సినిమాలో త్రిష తో కలిసి నటించిన మన్సూర్.. ఆమెపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో తను ఖుష్బూ, రోజా లాంటి హీరోయిన్లతో రేప్ సీన్లలో నటించానని.. అలాగే ” లియో ” కథ చెప్పగానే త్రిష తో కూడా ఒక రేప్ సీన్ ఉంటుందని.. భావించానని ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు.

ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈయన తీవ్ర వివాదాలలో చిక్కుకున్నాడు. మన్సూర్ ఆలీ ఖాన్ వ్యాఖ్యలను మంత్రి రోజా కూడా తప్పు పట్టింది. మగాళ్లు మాట్లాడే పద్ధతి మారాలంటే వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ” ఆడవాళ్ళ గురించి మగవాళ్ళు అసభ్యకరంగా మాట్లాడినప్పుడల్లా వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి.

నాపై దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే త్రిష, ఖుష్బూ, నాపై వ్యాఖ్యలు చేసిన మన్సూర్ ఆలీ ఖాన్ కావచ్చు. రాజకీయాలు, సినిమాలలో ఇలా ఏ వృత్తిలో అయినా ఎదిగి చూపించండి ” అంటూ మంత్రి రోజా కౌంటర్ వేసింది. ప్రస్తుతం రోజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.