‘ హాయ్ నాన్న ‘ మూవీ కోసం అదిరిపోయే స్కెచ్ వేసిన నాని.. ‘ దసరా ‘ సక్సెస్ కంటిన్యూ అవుతుందా..

నాచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. సీజన్ ఏదైనా కూడా క్యాష్ చేసుకోవడంలో ముందుంటున్నాడు నాచురల్ స్టార్. ఇక నాని చివ‌రిగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ద‌స‌రాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడైతే ఎలక్షన్ హీట్ ని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రాజకీయ పద్ధతిలోనే ఆయన ప్రమోషన్లు మొదలుపెట్టాడు.

ఇప్పటికే చంకీలాఅంగిలేసి పాట రూరల్ టౌన్ సిటీస్ అని తేడా లేకుండా మారుమోగిపోతూనే ఉంది. అదే రేంజ్‌లో హాయ్ నాన్న సినిమా కూడా జనాల్లోకి పంపించాలని నాని ఇలాంటి స్కెచ్ వేశాడు. దసరా సక్సెస్‌ను హాయ్‌నాన్న‌తో కంటిన్యూ చేయాలని భావిస్తున్న నాని.. ఈ మూవీ ఆడియన్స్ కి రీచ్ రావడం కోసం ఆదివారం జరిగే వరల్డ్ కప్ ని కూడా యూజ్‌ చేసేసుకున్నాడు.

ఇక డాటర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే నాని ఫాన్స్ తో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. ఇక నేచురల్ స్టార్ సినిమా ప్రమోషన్స్ ఫ్యూచర్లో ఇంకే రేంజ్ లో ఉంటాయో చూడాలి.