అట్లీ దర్శకత్వంలో తెలుగు సినిమా… పక్క బ్లాక్ బస్టర్ అంటున్న ఫ్యాన్స్…!!

షారుక్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్గా నటించిన ” జవాన్ ” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాని డైరెక్ట్ చేసిన అట్లీ పేరు బాలీవుడ్ పరిశ్రమలో మారుమోగిపోయింది. ఈ సినిమా భారీ స్థాయిలోనే కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక రీసెంట్గా చిత్ర నిర్మాణంలో తన ఆసక్తిని వ్యక్తం చేస్తూ.. అట్లీ తన ” ఏ ఫర్ ఆపిల్ స్టూడియోస్ ” బ్యానర్లో నాలుగు సినిమాలను నిర్మించనున్నట్లు ఈయ‌న వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈయన తన నిర్మాణంలో ” తేరి ” మూవీని బాలీవుడ్ రీమేక్ గా చేయబోతున్నాడు. అంతేకాకుండా అట్లీ తెలుగులో ఒక సినిమాని, తమిళ్ లో రెండు సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇక అట్లీ తన తర్వాత సినిమాపై దృష్టి పెట్టాడు. ఆమధ్య తనకు హాలీవుడ్ నుంచి కాల్ వచ్చిందని చెప్పి ప్రేక్షకులకి షాక్ ఇచ్చాడు. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ఈయన మాట్లాడుతూ..‌” నేను స్పానిష్ సినిమా చేయవచ్చు.

 

హాలీవుడ్ వారు నాకు కాల్ చేసి.. ఒకవేళ మీరు హాలీవుడ్ లో పని చేయాలనుకుంటే మాకు చెప్పండి…అని అడిగారు. జవాన్ సినిమా వారికి బాగా నచ్చింది. పైగా ఇలాంటి సినిమా వారు ఎప్పుడూ చూడలేదనే సరికి నేను దేవుడా అని ఆశ్చర్యపోయాను. ఈ ఐడియా మనకు మాత్రమే పని చేస్తుందని నేను అనుకున్నా. కానీ గ్లోబల్ గా కూడా ఇది వర్కౌట్ అవుతుంది ” అంటూ అట్లీ చెప్పుకొచ్చాడు. ఇకా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.