ప్రముఖ నటుడు అనుమానస్పదంగా మృతి… కారులో దొరికిన శవం…!!

ప్రముఖ తమిళ్ నటుడు వినోద్ థామస్(45) కన్నుమూశారు. కోట్టాయం సమీపంలో పాంపడిలోని బో హోటల్ పార్కింగ్ ఏరియాలో ఉన్న కారులో పడిపోయి ఉన్న ఈయన ని చూసి అనుమానంతో అక్కడి హోటల్ మేనేజ్మెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు అద్దాలు బద్దలు కొట్టి చూడగా అందులో వినోద్ చనిపోయి కనిపించారట.

కాగా విషవాయువులు పిల్చడం వల్లే ఈయన కన్నుమూసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక థామస్ సినిమాలతోపాటు మలయాళం లో పలు టీవీ సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. అంతేకాకుండా స్టేజ్ సింగర్ గా కూడా ఆయనకు మలయాళంలో మంచి పేరు ఉంది.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ” భగవాన్ దసంతే రామ్ రాజ్యం ” సినిమాలు కూడా వినోద్ కీలకపాత్రలో పోషించారు. ఏదేమైనప్పటికీఈనకి ఇలా జరగడం గమనార్హం. ఈ వార్త చూసిన ప్రేక్షకులు…” ఈయ‌న‌ది సంచలనమైన మృతి.. ఎవరు కావాలని చేశారు ” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.