త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా స్టోరీ లీక్‌.. ఫ‌వ‌ర్ ఫుల్ బ్యాక్ డ్రాప్‌తో రాబోతున్న బ‌న్ని…!!

ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం వంటి సూపర్ హిట్ ప్రాజెక్టులను తీసిన ఈ కాంబో మరోసారి జత కట్టారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ” పుష్ప 2 ” సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉండగా త్రివిక్రమ్ తన సినిమా స్క్రిప్ట్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.ఐతే, భారత స్వాతంత్య్ర ఉద్యమం నేపథ్యంలో ఈ మూవీ కథ ఉండనుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట. ఇక డిసెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం.

మొత్తానికి త్రివిక్రమ్, బన్నీల నాల్గ‌వ‌ సినిమాని గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ మరియు ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ చెప్పుకొచ్చారు. హారిక, హాసిని క్రియేషన్స్ మరియు గీత ఆర్ట్స్ కలిసి ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాకి సంగీతం థమన్ అందిస్తున్నాడు.