” అది తాగితే వచ్చే కిక్కే వేరు.. నా ప్రతి మార్నింగ్ దానితోనే మొదలవుతుంది “.. అనన్య సెన్సేషనల్ కామెంట్స్…!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులని ఆకట్టుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్స్టా స్టోరీలో కాఫీ మగ్ ఫోటోను షేర్ చేస్తూ..” ఉదయాన్నే కాఫీ తాగనిదే మనలో చాలా మందికి రోజు మొదలవదు.

కాఫీ తో రోజును ప్రారంభిస్తే రోజంతా ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా ఉంటాము. కాఫీ తాగితే ఆ కిక్కే వేరు. కాపిచినో,ఎస్ప్రెస్సో,ఫ్లాట్ వైట్, కర్టడో వెరైటీ ఏదైనా కాఫీతో సేద తీరాల్సిందే అనే వారే చాలామంది ఉన్నారు ” అంటూ రాసుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇదిలా ఉండగా తన బాయ్ ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్ తో ఇటీవల తెగ ఎంజాయ్ చేస్తుంది ఈ భామ. ఈమె స్టోరీని చదివిన ప్రేక్షకులు…” మన తెలుగు వాళ్లే కాదు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం కాఫీని ఆస్వాదించకుండా రోజు గడవదన్నమాట. అది కాఫీ కున్న రేంజ్. ఏ మాటకి ఆ మాటే చెప్పాలి కాఫీ చాలా బాగుంటుంది..” అంటూ కామెంట్లు చేస్తున్నారు.