తినడానికి తిండి కూడా లేని టైంలో మా ఫ్యామిలీని పోషించింది అతనే.. రాజమౌళి కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ను దక్కించుకున్న రాజమౌళి సినిమాలో నటించాల‌ని ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరో, హీరోయిన్లు అంతా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో రాజమౌళి ఎంతో కష్టపడేవారు. చిన్న కథలతో సినిమాలను తీసి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. తరువాత పాన్ ఇండియా సినిమా బాహుబలి సినిమాతో పాపులర్ అయ్యాడు. ఇక ఇటీవల వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమాకు ఆ ఆస్కార్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల‌కు ఎన్నో అరుదైన అవార్డులు దక్కాయి. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే ప్రస్తుతం రాజమౌళి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజమౌళి చిన్నతనంలో తన తండ్రి, పెదనాన్నలు ఇద్దరు చిన్న చిన్న కథల్లో సినిమాలు తీస్తూ పూట గ‌డవడం కూడా చాలా కష్టంగా ఉండేవారట. వీళ్ళదంతా ఉమ్మడి కుటుంబం కావడంతో ఇంట్లో 30 మంది పైగా జనాలు ఉండే వారిని వీళ్ళందర్నీ పోషించడానికి రాజమౌళి తండ్రి, పెదనాన్న తెచ్చే డబ్బులు ఏమాత్రం సరిపోయేవి కావట‌.

అలాంటి టైం లో కుటుంబ భారం మొత్తం ఎంఎం కీరవాణి తన భుజాల మీద వేసుకొని చాలా సంవత్సరాలు పాటు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసి ఫ్యామిలీని పోషించేవాడని.. అలాంటి సందర్భంలో కీరవాణి వైఫ్ అయిన శ్రీవల్లి కూడా ఏ విషయంలోనూ ఆయనకు అభ్యంతరం చెప్పేది కాదని.. ఆమె రాజమౌళి, కళ్యాణ్ మాలిక్, కాంచీలను సొంత బిడ్డల్లాగా చూస్తూనేదని రాజమౌళి ఓ సంద‌ర్బంలో చెప్పుకొచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే మాకు తిండి కూడా లేని సమయంలో కీరవాణి గారు ఎంతో సహాయం చేశారని.. శ్రీవల్లి కానీ కీరవాణి గారిని ఆపి ఉంటే మా కుటుంబం విడిపోయి ఉండేదని.. అలా కాకుండా ఆమె కూడా మమ్మల్ని సొంత బిడ్డల్లా చూసుకుందని చెప్పుకొచ్చాడు.

ఇక రాజమౌళి ఈ కృతజ్ఞతతోనే కీరవాణిని తన ప్రతి సినిమాలో సంగీత దర్శకుడుగా కొనసాగిస్తూ ఉంటాడు. అలాగే శ్రీవల్లి గారిని లైన్ ప్రొడ్యూసర్‌గా, కాంచి గారిని స్క్రిప్ట్ కి సంబంధించిన పనుల్లో, క‌ళ్యాణ్ మాలిక్‌ని మ్యూజిక్ ప‌నులో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం అందరికీ తెలుసు. ఇలా ప్రస్తుతం రాజమౌళి ఉన్న పొజిషన్లో వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా తన సినిమాలో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు. అలాగే కీరవాణి , అత‌ని భార్య శ్రీవల్లి అంటే రాజమౌళికి ఎంతగానో ఇష్టమట. వాళ్ళ అమ్మా, నాన్నలను ఎలాగైతే చూసుకుంటాడో అన్న, వదినలను కూడా అలాగే చూసుకుంటాడట.