హీరోయిన్ సమంతకు క్రయోథెరఫీ… అంటే ఏమిటో తెలుసా?

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’ సినిమాతోనే తెలుగు కుర్రకారు మనసులను కొల్లగొట్టిన హీరోయిన్ సమంత. అంతే కాదు, ఆ సినిమాలో నటించిన అక్కినేని వారసుడిని కూడా ఈ అమ్మడు మాయచేసి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని అనూహ్య కారణాల వలన వారు పెళ్ళైన కొన్నాలకే విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె అనారోగ్యం బారిన పడడం జరిగింది. గత ఏడాది ఆమెకు మయోసైటిస్ బయటపడింది. దాంతో ఈ వ్యాధికి సుదీర్ఘ కాలంగా చికిత్స తీసుకుంటుంది. దీనిలో భాగంగా ఆమె క్రయోథెరఫీ చేయించుకున్నట్టు సమాచారం.

13 ఏళ్లకు పైగా సాగుతున్న సినీ కెరీర్లో సమంత చాలా మంచి పేరు తెచ్చుకుంది. అదేవిధంగా ఎన్నో ఒడిదుడుకులు కూడా చూసింది. సమంత కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుండగానే తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. విడాకులు సమంతను తీవ్రమైన మానసిక వేదనకు గురి చేశాయి. తీరా ఆ బాధ నుండి బయటపడింది అనుకొనే లోపే సమంతకు అరుదైన మయోసైటిస్ వ్యాధి సోకడం దురదృష్టకరం. ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు ఏమిటంటే దీని వలన కండరాల వాపు, నొప్పి, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది ప్రాణాంతకం కానప్పటికీ తేలిగ్గా తీసుకొనేంత చిన్న సమస్య కూడా కాదు.

ఇక ఈ నేపధ్యంలోనే ఆమె క్రయోథెరపీ చేయించుకున్నారట. క్రయోథెరఫీ అంటే ఏమిటంటే, గడ్డకట్టించే చల్లని నీళ్లతో శరీరాన్ని తడిపే ప్రక్రియ. అత్యంత కోల్డ్ వాటర్ ఉన్న టబ్ లో గొంతు మునిగి కొన్ని నిమిషాల పాటు అలగే ఉండాలి. శరీరాన్ని అత్యంత చల్లని నీటిలో ఉంచడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మయోసైటిస్ వ్యాధి వలన కండరాల నొప్పి, వాపు వంటి సమస్యలు ఏర్పడతాయి. క్రయోథెరపీ కండరాల నొప్పి, వాపు తగ్గిస్తుంది. అలాగే అసహజమైన, అనారోగ్య పూరితమైన కణజాలంను నాశనం చేస్తుందట. మయోసైటిస్ సోకిన వాళ్లకు క్రయోథెరఫీ గొప్ప ట్రీట్మెంట్ అని సమాచారం. అందుకే సమంత ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.