” సలార్ ” సినిమాతో ఫైనల్ మెట్టు ఎక్కుతాను ” … జగపతిబాబు కామెంట్స్ వైరల్…!!

టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నాడు. యంగ్ హీరోల సినిమాలలో విలన్ పాత్రలు చేస్తూ తన గుర్తింపును ఇంకా పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ” సలార్ ” సినిమాలోను ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

అలాగే ఈయన తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. కేజిఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్.. రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న.. ఈ సినిమాతో కెరీర్ లో తను మరింత ఎత్తుకు ఎదగబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు జగపతిబాబు. బ్లాక్ దుస్తులు ధరించి.. స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ.. ప్రేక్షకులను అలరించాడు.

దీనికి క్యాప్షన్ ఇస్తూ..” సలార్ సినిమాతో పై మెట్టు ఎక్కబోతున్న..” అంటూ రాసుకొచ్చాడు. దీని బట్టి చూసుకుంటే ఈ సినిమాలో ఈయన క్యారెక్టర్ ఓ రేంజ్ లో ఉంటుందన్నమాట. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి గ్రాండ్ గా రానుంది.