బాహుబలి సినిమా పైన షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో విక్రమ్..!!

తెలుగు ప్రేక్షకులకు కూడా తమిళ హీరో చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు..ఆయన నటించిన సినిమాలు కూడా తెలుగులో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. విక్రమ్ పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తు వచ్చేది ప్రయోగాలకు పెట్టింది పేరు అని ముఖ్యంగా అపరిచితుడు సినిమాతో తనలోని నటనతో బీభత్సవం సృష్టించారు హీరో విక్రమ్.. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలలోనే కాకుండా ఈయన పేరు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటుంది.

వివాదాలకు సైతం దూరంగా ఉంటే విక్రమ్ సినిమాలలో పాత్ర కోసం ఎంత కష్టాన్ని అయినా సరే భరిస్తూ ఉంటారు. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటారు.. ఇదంతా ఇలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో విక్రమ్ కు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది. అదేమిటంటే విక్రమ్ తాజాగా నటిస్తున్న తంగలాన్ చిత్రంలో నటించారు తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తూ ఉండగా టీజర్ లో విక్రమ్ తన నటనతో తన బాడి లాంగ్వేజ్ తో అందరికీ వణుకు పుట్టించేలా చేశారు.

ముఖ్యంగా ఈ సినిమాలో అగోర తరహాలో పాత్రలో విక్రమ్ జీవించేసారని చెప్పవచ్చు. ఇందులో మలయాళం నటి మాళవికా మోహన్ నటిస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ నిర్మిస్తూ ఉన్నారు. హైదరాబాదులో ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక రిపోర్టర్ ఆసక్తికరమైన ప్రశ్నను అడిగాగా.. తమిళ సినిమాని తెలుగు ఆడియన్స్ ఎంకరేజ్ చేసినంతగా తెలుగు చిత్రాలను తమిళ ఆడియోస్ ఎందుకు ఎంకరేజ్ చేయడం లేదని ప్రశ్నించగా..

అందుకు సమాధానంగా విక్రమ్ బాహుబలి, RRR చిత్రాలతో తమిళనాడులో టాప్ గ్రాస్ వసూలు నిలిచాయి.. తెలుగు సినిమాకి మేము ప్రాధాన్యత ఇస్తాము అనేదానికి ఇదే ఉదాహరణ.. ఐ సినిమా కోసం జాతీయ అవార్డు కోసం ప్రయత్నించినప్పుడు తమిళ జ్యూరీ నుంచి ఒకరు నాకు చెప్పారు మేము బాహుబలి తమిళ వర్షాన్ ని జాతీయ అవార్డుగా పంపాలనుకుంటున్నాము అందుకే మీ చిత్రానికి సపోర్ట్ చేయలేదని తెలిపారట. దీన్నిబట్టి అర్థం చేసుకోవాలని తెలిపారు విక్రమ్.