” 30 ఏళ్లు దాటిన.. నాకు ఆ సోయి లేదంటూ ఎగతాళి చేశారు “…శృతిహాసన్ కామెంట్స్ వైరల్…!!

శృతిహాసన్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె అందం, నటనతో ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది. తాజాగా ఈ బ్యూటీ వయసు పెరుగుతున్న కొద్దీ తన జీవితంలో చోటు చేసుకున్న మార్పుల గురించి ఓపెన్ అయింది.

ఈ ముద్దుగుమ్మకు 30 ఏళ్లు దాటిన తర్వాత తనలో చాలా పరిపక్వత పెరుగుతుందని.. అందుకే ప్రశాంతంగా ఉండగలుగుతున్నానంటూ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అంతేకాకుండా..” నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మనసు బాగుంటేనే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. కొంతకాలంగా నా పెళ్లి విషయంలో అనేక విమర్శలు ఎదుర్కొన్నాను ” అంటూ చెప్పుకొచ్చింది.

శృతి ఇంకా మాట్లాడుతూ..” 30 ఏళ్లు దాటాయని గుర్తుచేసి మరి ఎగతాళి చేశారు. చాలా ఒత్తిడికి గురయ్యాను. నా పెళ్లి గురించి నాకంటే వాళ్లే ఎక్కువ బాధ పడుతున్నారు. నిజానికి ఈ వయసు దాటేలోపు పెళ్లి చేసుకోవడం నేరమా? దానివల్ల దేశం ఆగిపోతుందా? ” అంటూ ప్రశ్నించింది. ఇక ఏదేమైనా పెళ్లిపై ఎలాంటి బెంగ పెట్టుకోకుండా ఇప్పటికే హ్యాపీగా జీవితాన్ని సాగిస్తుంది శృతి. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా కెరీర్ లో దూసుకుపోతుంది.