లియో సక్సెస్ మీట్ లో రజనీకాంత్‌పై హీరో విజయ్ సెటైర్లు

సోషల్ మీడియాలో ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ జరగడం అనేది కామన్. అభిమానులు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటారు. తమ హీరోనే గొప్ప అని చెప్పుకోవడానికి ఎదుటి హీరోలపై కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇద్దరి హీరోల మధ్య గొడవలు జరగడం, సెటైర్లు వేసుకోవడం అనేది కూడా చాలా అరుదుగా జరుగుతోంది. బహిరంగ వేదికలపై ఒక్కొక్కసారి సరదాగా కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవలే అలాంటి సంఘటనే ఒకటి తమిళ సినిమా ఇండస్ట్రీలో చోటు చేసుకుంది.

రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ సినిమా సూపర్ హిట్ అయింది. అన్ని బాషల్లోనూ ఈ సినిమా హిట్ అయింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్.. స్టార్ హీరో విజయ్ మీద పరోక్షంగా సెటైర్లు పేల్చారు. విజయ్ నటించిన బీస్ట్ సినిమా టేకింగ్ బాగానే ఉంటుందని, కానీ తారాగణం సరిగా లేదని కామెంట్ చేశారు. అందుకే సినిమా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయిందని రజనీకాంత్ అభిప్రాయపడ్డాడు. కాకి గాల్లోకి ఎగరగానే ఈ ప్రపంచం మొత్తం తనదే అని అనుకుంటుందని, కానీ ఆ ఆకాశంలో నేను గ్రద్ద లాంటోడినని,, నన్ను కాకులు ఏమి చెయ్యలేవని విజయ్ ను ఉద్దేశించి తలైవా కామెంట్స్ చేశాడు.

అయితే రజనీకాంత్ కామెంట్స్ కు విజయ కౌంటర్ ఇచ్చాడు. లియో సినిమా సక్సెస్ మీట్ లో రజనీకాంత్ కామెంట్స్ పై విజయ్ స్పందించాడు. ఒక అడవిలో చాలా క్రూరమైన జంతువులూ ఉన్నాయి. అదే అడివిలో ఒక కాకి మరియు ఒక గ్రద్ద కూడా ఉంటాయి. ఎంత పెద్ద గ్రద్ద అయినా, కాకి అయినా నేల మీదకి రావాల్సిందే. నేను నేల లాంటి వాడిని, ఎప్పుడూ తటస్తంగానే ఉంటాను’ అని విజయ్ సెటైర్లు వేశాడు.