చందమామ అసూయపడేంత‌ అందంతో త్రిషా.. వయసుతో పాటు అందం కూడా పెరుగుతుందిగా అంటూ..

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిషకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటుతున్న ఇంకా అదే క్రేజ్‌తో కొనసాగుతుంది. మధ్యలో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ పోనియన్ సెల్వన్ 2 సిరీస్ తో రియంట్రీ వచ్చింది. ఈ సినిమా లో ఆమె నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకొని వరుస అవకాశాలను అందుకుంటుంది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తరువాత.. విజయ్ లీయోలో హీరోయిన్గా నటించింది.

ఇందులో లిప్ లాక్ సీన్లో కూడా నటించింది. త్రిష ఈ సినిమాతో భారీ క్రేజ్‌ను అందుకుంది. ఇక‌ ఈ ముద్దుగుమ్మకు ప్ర‌స్తుతం వరుస‌ అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఓ పక్కన సినిమాల్లో మెరుస్తూనే మరో పక్కన సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోషూట్లతో ఫ్యాన్స్ కు హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. వ‌య‌స్సు 40 దాటుతున్న‌ తరగని అందంతో చందమామల మెరుస్తూ అభిమానులని ఆకట్టుకుంటుంది.

ఇటీవల మెరూన్ శారీలో వైట్ స్టోన్స్ చౌకర్తో క్యూట్ స్మైల్ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వయసు పెరిగే కొద్దీ నీకు అందం కూడా పెరుగుతుంది అంటూ.. చందమామకే అసూయ పుట్టించేంత అందంగా ఉన్నావు త్రిష.. అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.