బ్రౌన్ రైస్ తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

చాలామంది ఎక్కువగా వైట్ రైస్ ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ రైస్ లో చాలా రకాలు ఉంటాయి.. అలాంటి వాటిలో బ్రౌన్ రైస్ కూడా ఒకటి.ఇవి చూడడానికి కాస్త లావుగా ఉన్నప్పటికీ తినడానికి రుచిగా అనిపిస్తాయి.. ఇందులో ఉండే పోషకాలు కూడా శరీరానికి బాగా ఉపయోగపడతాయి. బ్రౌన్ రైస్ తినడం వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


బ్రౌన్ రైస్ లో ఎక్కువగా ఖనిజాలు విటమిన్స్ వంటివి పుష్కలంగా లభిస్తాయి.. బ్రౌన్ రైస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగనివ్వదు.. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

బ్రౌన్ రైస్ లో ఎక్కువగా పోషకాలు ఉండడం వల్ల బరువు తగ్గించేందుకు చాలా ఉపయోగపడతాయి. చాలామంది వీటిని తినడానికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది.

బ్రౌన్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని కూడా వ్యతిరేకిస్తాయి.

బ్రౌన్ రైస్ లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల సహజంగా ఉండే బియ్యంలో కంటే అధిక స్థాయిలో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ఫైబర్ శరీరంలోని టాక్సిన్స్ పైన ఇంకా క్యాన్సర్ కు కారమయ్యే పదార్థాల పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

బ్రౌన్ రైస్ కాకుండా పాలిష్ చేసిన బియ్యాన్ని తరచూ తినే వారిలో ఎక్కువగా మధుమేహం వచ్చే అవకాశం మెండుగా ఉందని ఒక అధ్యయనంలో తెలియజేశారు.

బ్రౌన్ రైస్ ని ఏ విధంగా అయినా సరే తినడం వల్ల పలు రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఈ రైస్ ని తరుచూ తింటూ ఉండడం వల్ల మన శరీరం కూడా చాలా దృఢంగా మారుతుంది.