అనుష్క లో ఉండే ఆ అలవాటు ప్రభాస్కు అస్సలు నచ్చదా.. చాలా సార్లు హెచ్చ‌రించిన స్వీటి అస‌లు విన‌లేదా..!!

టాలీవుడ్ ప్రేక్షకుల్లో కొన్ని జంట‌లు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాయి. అలాంటి వారిలో అనుష్క – ప్రభాస్ జంట ఒకటి. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. మొదట బిల్ల సినిమాతో కలిసిన నటించినా ఈ జంట తరువాత మిర్చి, బాహుబలి సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనుష్కకు ప్రభాస్‌కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ సినిమా షూటింగ్స్ టైం లో కూడా ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారు. దీంతో వీరిద్దరి మధ్యన మంచి ఫ్రెండ్షిప్ బాండ్ ఏర్పడింది. ఇక గతంలో వీరిద్దరూ క్లోజ్‌గా ఉండడంతో సోషల్ మీడియాలో వీరిద్దరూ లవర్స్ అంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఎప్పటికప్పుడు ఈ వార్తలను తిప్పుకొడుతూ మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ అనుష్క – ప్రభాస్ చెప్తూనే ఉంటారు.

ఇక అసలు విషయానికి వస్తే అనుష్క లోని కొన్ని అలవాట్లు ప్రభాస్ కి అసలు నచ్చవట. అలాంటి నేపథ్యంలో అనుష్కకు కొన్ని సలహాలు కూడా ఇచ్చేవాడట ప్రభాస్. తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకునే స్వీటీకి ఓ బాడ్ హ్యాబిట్ ఉందట. ఆమె ఎప్పుడు చూసినా గోర్లు కొరుకుతూ ఉంటుందట. ఏ విషయం గురించి అయినా ఎక్కువగా ఆలోచిస్తున్న.. కంగారు పడుతున్న గోర్లు కొరుకుతూ ఉంటుందట. అయితే ఇలా గోర్లు కొరకడం ప్రభాస్ కు అసలు నచ్చదట. అనుష్కకు కూడా చాలాసార్లు ప్రభాస్ ఈ విషయంలో హెచ్చరించాడట. ఇలా గోళ్ళు కొరకడం మంచిది కాదని చెప్పినప్పుడల్లా.. అనుష్క సరే అన్నట్లు తల ఊపేదట. మళ్ళీ ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు ఆమె గోళ్ళు కొరుకుతూ కనిపించేదట.

దీంతో విసుగెత్తిన ప్రభాస్ చూసి చూడనట్లుగా ఆమె గోళ్ళు కొరుకుతున్న పట్టించుకోకుండా పక్కకు వెళ్ళిపోయేవాడని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే వీరిద్దరూ ప్రస్తుతం వరుస అవకాశాలను అందుకుంటున్నారు. గతంలో జీరో సైజ్‌ సినిమా ద్వారా అవకాశాలను కోల్పోయిన అనుష్క తాజాగా మిస్‌శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్ అవడంతో మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ప్రభాస్ – అనుష్క కూడా సినీ కెరీర్‌లో బిజీగా గడుపుతున్నారు. ఇక తాజాగా ప్రభాస్ సలార్ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ వేడుకగా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానుంది.