హైదరాబాద్ శివారులో ఇబ్రహింపట్నంలోని ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగిందట. దీంతో పోలీసులు దాడి చేసి పార్టీ ని భగ్నం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయి. ఇందులో బిగ్ బాస్ బ్యూటీ హిమజ తో పాటు 11 మంది స్టార్లు పట్టుబడినట్లు సమాచారం. తాజాగా.. దీనిపై హిమజా స్పందిస్తూ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది.
హిమజా మాట్లాడుతూ…” నిన్న నా కొత్తింట్లో తొలిసారి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్నాను. ఎవరో ఏదో అనుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి మా ఇంటిని సోదా చేశారు. అందుకు మేము కూడా సహకరించాం. వాళ్ల విధిని నిర్వర్తించారు. అయితే కొందరు దీన్ని రేవ్ పార్టీ అని తప్పుడు ప్రచారం చేశారు.
నేను ఇంట్లోనే ఉన్నాను. సంతోషంగా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటుంటే నేను అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ లో ఉన్నట్లు వార్తలు రాశారు. ఇందులో ఏమాత్రం నిజం లేదు. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారం స్ప్రెడ్ చేయకండి ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హిమజ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.