దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు జరుపుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. చిన్న, పెద్ద ఇలా అందరూ ఎంతో సంతోషంగా దీపావళి వేడుకను జరుపుకున్నారు. ఇందులో భాగంగా సినీ ప్రముఖులు సైతం దీపావళి జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు. తాజాగా రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రిటీలకు నిన్న రాత్రి దీపావళి పార్టీ ఇచ్చినట్లు సమాచారం.
శనివారం హైదరాబాదులోని తమ నివాసంలో ఈ వేడుక చేసుకున్నారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు సైతం హాజరయ్యారు. వెంకటేష్, మహేష్ బాబు, నమ్రత, ఎన్టీఆర్, ప్రణతి ఇలా టాలీవుడ్ నటీనటులు, దర్శక నిర్మాతలు ఈ పార్టీలో సందడి చేశారు. విందు భోజనం గేమ్ తో అందరూ సరదాగా గడిపారు. అయితే పార్టీకి సంబంధించిన ఫోటోలను మహేష్ బాబు భార్య నమ్రత తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
అందులో వెంకటేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. నలుగురు టాలీవుడ్ స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో కనబడడంతో తమ అభిమానులు ఎంతో ఖుషి అయ్యారు. క్లీన్ కారా పుట్టిన తరువాత మొట్టమొదటి దీపావళి కావడంతో చరణ్, ఉపాసన ఈ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తుంది. ఈ స్టార్ కాంబో ఫోటో చూసిన ప్రేక్షకులు…” ఒకే ఫ్రేమ్ లో ఇంతమంది స్టార్స్ ను చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram