వార్ 2 లో ఎన్టీఆర్ జంటగా నటించే ఛాన్స్ కొట్టేసిన ఆ పాన్ ఇండియన్ బ్యూటీ.. ఎవరంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతేడాది రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ లో సొంతం చేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవరా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ ను ప్లే చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శ‌రవేగంగా జరుగుతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ ను తెచ్చి పెట్టాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎన్టీఆర్ అభిమానులు, సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ తో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ వార్‌2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యష్‌ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. అయితే తాజాగా హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ లకు సంబంధించిన షూట్ కూడా ప్రారంభించారంటూ న్యూస్ వైరల్ అయింది.

జనవరి నుంచి మూవీ షూటింగ్లో జాయిన్ అవ్వబోతున్నాడట తార‌క్‌. ఇక ఈ ఏడాది చివరిలోపే దేవర సినిమాను పూర్తి చేసేయాలని ఎన్టీఆర్ తో పాటు మేకర్స్ కూడా భావిస్తున్నారు. ఇక స్పై థ్రిల్లర్ వార్ 2 కోసం ప్రత్యేకంగా ఎన్టీఆర్ ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ వర్గాల సమాచారం ప్రకారం వార్2 లో నటించబోయే హీరోయిన్ల పేర్లు వైరల్ అవుతున్నాయి. వార్‌2 హీరోయిన్ల పాత్రలు ఫైనల్‌ చేసేందుకు టీం ప్రయత్నిస్తున్నారట.

దీనికోసం దీపిక పదుకొనే, అలియా భట్ ల‌ను సంప్రదించినట్లు తెలుస్తుంది. ఇటీవల వీఆర్‌ఎఫ్ నిర్మించే పై యూనివర్సల్ మూవీలో ఆలియా హీరోయిన్ గా నటించబోతుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అందువల్ల వార్‌2 లో ఆలియా అతిధి పాత్రలో నటించవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీపిక పదుకొనే ఆర్య భట్‌ల‌లో ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తారో అనేది అధికార ప్రకటన వస్తేకానీ తెలియదు.