మృణాల్ ఠాకూర్ తో విజయ్ దేవరకొండ అంత దూరం వెళ్లిపోయాడా… పాపం రష్మిక…!!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కలిసి తాజాగా ” ఫ్యామిలీ స్టార్ ” సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి డైరెక్టర్ పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, సోషల్ మీడియాలో భారీ హైప్‌ ను క్రియేట్ చేశాయి. అలాగే అందులోని డైలాగ్స్ ఇప్పటికీ కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశాడు. ఆ పిక్ లో విజయ్, మృణాల్ తో కలిసి దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఓ పిక్ ని షేర్ చేశాడు.

ఈ ఫోటో ఫ్యామిలీ స్టార్ సినిమాలోనీ స్టిల్. ఈ పోస్టర్ విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాలో తండ్రి, భర్తగా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు విజయ్. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.