ఆ కోరిక తీర్చుకునేందుకే నాతో సన్నిహితంగా ఉన్నాడు.. డైరెక్టర్ పై హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..

నటి మనిషా యాదవ్ కాంట్రవర్షల్ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది. బాలాజీ శక్తివెల్ ద‌ర్శ‌కత్వం వహించిన వజక్కు ఎన్ 18/9 సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తరువాత వరుసగా అవకాశాలు అందుకుంది. అలా ఒరు కుపం కాదల్‌తో పాటు పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ డైరెక్టర్ శీను రామస్వామి దర్శకత్వంలో ఇదమ్ పొరుల్ యావ‌ళ్ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. అయితే ఈమె సినిమాకు సహకరించడం లేదని, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని సినిమా నుంచి ఆమెను తప్పించినట్లు డైరెక్టర్ ఆరోపించాడు. కాగా ఇదమ్ పొరుల్ యావ‌ళ్ సినిమా టైంలో నటి మనిషా యాదవ్ పై లైంగిక వేధింపులకు ప్రయత్నించాడంటూ శీను రామస్వామి పై కూడా పలు ఆరోపణలు వినిపించాయి.

తర్వాత ఆమె ప్లేస్ లో నందిత శ్వేతను హీరోయిన్గా తీసుకుని సినిమా పూర్తి చేశారు. అయితే అన్ని పనులు అయిపోయిన సినిమా ఇప్పటికీ రిలీజ్ కాలేదు. ఇటీవల ఆమె మరోసారి రామస్వామి సినిమాలో హీరోయిన్గా నటిస్తుంద‌టు వార్త‌లు వినిపించాయి. దీనిపై మ‌నీషా స్పందించింది.. మనీషా అలాంటి డైరెక్టర్ సినిమాల్లో నేను ఇకపై నటించబోయేది లేదంటూ.. ఇటీవల ఓ పాత్ర కోసం శీను రామస్వామి ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది నా సినిమాలో నటిస్తావా అంటూ ఆయన అడిగాడు.. కానీ కరకండిగా నేను చేయనని చెప్పేశా అంటూ చెప్పుకొచ్చింది. గతంలో అతని మూవీలో నేను నటిస్తున్న టైం లో అతని ప్రవర్తన చాలా దారుణంగా అనిపించింది.

తప్పుడు ఉద్దేశంతో ఫ్రెండ్లీగా ఉండాలని ప్రయత్నించాడు. కానీ నేను అతని కోరికలకునో చెప్పా. అందుకే నన్ను సినిమా నుంచి తప్పించాడు. పైగా నాకు నటన రాలేదంటూ తప్పుడు ఆరోపణలు చేశాడు. నేను చాలా పెద్ద పెద్ద దర్శకులతో సినిమాల్లో నటించా. ప్రతిభ ఉన్న ఇలాంటి మానవత్వం లేని దర్శకుడు సినిమాల్లో నటించాల్సిన పని నాకు లేదు.. అంటూ వివరించింది. అయితే ఇటీవల జరిగిన ఓ ఆడియో లాంచ్ కార్యక్రమంలో అందరి లానే నేను మర్యాదపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాను.. అంతేకానీ అతని సినిమాలో ఎప్పటికీ నటించను. నాకు మంచి భర్త, కుటుంబం, స్నేహితులు ఉన్నారు. ఇలాంటి చేదు అనుభవాలు ఎలాంటి కొత్త హీరోయిన్లకు రాకూడదు అంటూ మనీషా యాదవ్ కామెంట్స్ చేసింది.