టైట్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తున్నఈ గ్లోబల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..?!

టైట్ ఫిట్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ స్టైలిష్ గా క‌నిపిస్తున్న‌ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఇంకా గుర్తుపట్టలేదా.. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ప్రస్తుతం అబుదాబిలో జరుగుతున్న బాలీవుడ్ ఈవెంట్స్ లో సందడి చేస్తుంది. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ ప్రేక్షకులను తన నటనతో మెప్పిస్తున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా ఆ ఈవెంట్ కు సంబంధించిన అవుట్ ఫిట్ తో ఫోటోకు స్టిల్స్ ఇచ్చి కుర్ర కారును ఆకట్టుకుంది.

సాధారణంగా గ్రామర్ షో చేస్తూ ప్రియాంక చోప్రా ఇలాంటి కార్యక్రమాల్లో సందడి చేస్తుంది. కానీ ఈ ఈవెంట్ల మాత్రం ప్రియాంక స్కిన్ షో చేయలేదు. కనీసం నడుమందాన్ని కూడా క‌న‌ప‌డ‌కుండా కవర్ చేసేసింది. అయినా కూడా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. టైట్ డ్ర‌స్‌లో చూస్తుంటే మతిపోతుందని హాలీవుడ్.. హాట్ బ్యూటీస్ కి ఏమాత్రం తగ్గకుండా అందంతో ప్రియాంక మెరిసిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజ‌న్లు.

ఇక ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్ షోలతో, అవార్డు వేడుకల‌లో సందడి చేసే ప్రియాంక ఈసారి పింక్ అండ్ బ్లాక్ టైట్ డ్రెస్, స్టైలిష్ గూగుల్, లూజ్ హెయిర్ తో దర్శనమిచ్చింది. టక్కున చూస్తే ప్రియాంక చోప్రా అని గుర్తుపట్టాలేనంతగా ఈ పిక్స్ లో కనిపిస్తుంది. అయితే దగ్గర నుంచి చూస్తే ఇది ప్రియాంకనే ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఇక ప్రియాంక చోప్రా మరో 10 ఏళ్ల వరకు బాలీవుడ్, హాలీవుడ్లో తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పాపులారిటి సంపాదించుకుంది.