” ఒంటిపై టవల్ మాత్రమే ఉంది “… కత్రిన పై హీరో కామెంట్స్ వైరల్…!!

హీరో విక్కీ కౌశల్ తన భార్య కత్రినా కైఫ్ మనందరికీ సుపరిచితమే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్కీ తన భార్య కత్రినా హార్డ్ వర్క్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ” సామ్ బహదూర్ ” ప్రమోషన్స్ నిర్వహిస్తున్న ఈయన.. ఓ ఇంటర్వ్యూలో ” టైగర్ 3 ” లో వైఫ్ యాక్టింగ్ స్కిల్స్ కు ఫిదా అయ్యానని చెప్పుకొచ్చాడు.

ముఖ్యంగా టవల్ ఫైట్ చూసి మైండ్ బ్లాక్ అయిందని.. వెంటనే తనకు ఓ విషయం చెప్పానని వివరించాడు. ” కత్రినా ఆ టవల్ ఫైట్ నాపై మాత్రం ప్రయోగించొద్దు. ఇక ఇప్పటినుంచి నీతో ఆర్గ్యు చెయ్యను. బహుశా నువ్వు బాలీవుడ్ లో అత్యంత అద్భుతమైన యాక్షన్ హీరోయిన్ ” అని చెప్పినట్లు తెలిపాడు విక్కి.

ఆమె పడిన కష్టానికి గర్వపడుతున్నానని.. ఆమె నిజంగా తనను ఇన్స్పిరేట్ చేసిందని తెలిపాడు. కాగా ప్రస్తుతం విక్కీ ‘ సామ్ బహదూర్ ” సినిమా ” యానిమల్ ” తో పోటీ పడనుంది. ఇలాంటి టఫ్ ఫైట్ ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించగా.. ఆడియన్స్ కచ్చితంగా మంచి సినిమాను ఆదరిస్తారని సమాధానం తెలిపాడు విక్కి. ప్రస్తుతం విక్కి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.