మరో 100 రోజుల్లో ” డబల్ ఇస్మార్ట్ ” రిలీజ్… పక్కా కేకే అంటున్న ఫ్యాన్స్…!!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని హీరోగా.. డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” డబల్ ఇస్మార్ట్ “. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చ్ 8న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అంటే ఈ సినిమా మరో 100 రోజుల్లో ఆడియన్స్ ముందుకి రానుంది.

ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. రిలీజ్ చేసిన సరికొత్త పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు.

ఈ సినిమాను ఒక్క తెలుగు భాషలోనే కాకుండా హిందీ, తమిళ్, మలియాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా కోసం రామ్ అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇకా ఈ పోస్టర్ చూసిన ప్రేక్షకులు…పక్కా కేకే అంటున్నారు.. ఫ్యాన్స్.