తారక్, హృతిక్ ల ” వార్ 2 ” రిలీజ్ డేట్ ఫిక్స్…. ఎప్పుడంటే…!!

ప్రస్తుతం ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మోస్ట్ అవైటెడ్ క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఏదన్నా ఉంది అంటే అది.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ లా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ వార్ 2 ” అనే చెప్పాలి.

ఇక ఈ సెన్సేషన్ కాంబో అనౌన్స్ చేసినప్పుడే నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ బిగ్గెస్ట్ మూవీని బ్రహ్మాస్త్ర ఫేమ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందంటూ టాక్ వినిపిస్తుంది.

ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ని మేకర్స్ 2025 ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఆగస్ట్ 14 గురువారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుందని సమాచారం. సో ఈ సినిమా కోసం ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ ని యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ తమ స్పై యూనివర్స్ లో భాగంగా చేస్తున్న సంగతి తెలిసిందే.