చంద్రమోహన్ తన ఆస్తి మొత్తం ఎవరికి రాసారో తెలుసా…!!

సీనియర్ హీరో చంద్రమోహన్ గారి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో, కామెడీతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. వయసు మీద పడుతున్న ఏమాత్రం లెక్కచేయకుండా.. ఈయనకి సెట్ అయిన పాత్రలలో నటిస్తూ దూసుకుపోయారు. ఈయన.. ముందు హీరోగా చేసినప్పటికీ అనంతరం.. కామెడీ రోల్స్ చేస్తూ ప్రేక్షకులని అలరించారు. ఇక అప్పట్లో కబ్జాలు ఎక్కువగా చేస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రమోహన్ భయపడి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర ఉన్న 6 ఎకరాలను అమ్ముకున్నారు.

అదే ఉంటే ఇప్పటికీ ఈయ‌న‌ ఆస్తి వేల కోట్లలో ఉండేదంటూ చంద్రమోహన్ పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు. అయినప్పటికీ చంద్రమోహన్ హైదరాబాదులో మరికొన్ని పెద్ద ఎత్తున భూములు కొన్నట్లు సమాచారం. ఇక ఈయన సంపాదించిన వంటి ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్ కాకుండా భూముల విలువ మాత్రమే రూ. 300 కోట్లు వరకు ఉండొచ్చని సమాచారం.

ఇక ఈయన మరణించిన తరువాత ఆస్తి మొత్తం ఎవరికీ చెందాలి అనేది మొత్తం వీలునామా రాసినట్లు తెలుస్తుంది. ఈ వీలునామాలో భాగంగా తన ఆస్తి మొత్తం తన ఇద్దరు కూతుర్లకు సరి సమానంగా రాశారట. ఈయనకి కొడుకు లేకపోవడంతో ఆస్తి మొత్తం కూతుర్లకే రాసేశారు. ఇలా ఈయన ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తిపాస్తులను మొత్తం తన కూతుర్లకు రాసేసి.. తిరిగారాని లోకానికి వెళ్లిపోయారు చంద్రమోహన్.