తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రాజమౌళి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి పాన్ ఇండియా లేవల్లో పేరు సంపాదించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన పేరుని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు.. అయితే రాజమౌళి ఎంతో మంది హీరోయిన్లను సైతం స్టార్ పొజిషన్లోకి తీసుకువచ్చారు. అలాంటి వారిలో హీరోయిన్ సలోని కూడా ఒకరు. ఈమె నటించింది కొన్ని సినిమాలు అయినా తన అందం నటనతో అభినయంతో మంచి గుర్తింపు అందుకున్నది. తెలుగు తమిళ్ కన్నడ వంటి భాషలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.
తెలుగులో ఎన్నో సినిమాలలో నటించిన సక్సెస్ రాకపోవడంతో రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమా ద్వారా మంచి క్రేజ్ అందుకుంది. ఇందులో హీరోయిన్ గా ఈమెను తీసుకోవడానికి ముఖ్య కారణం ఉందట. ఈమె స్వయంగా రాజమౌళికి దగ్గర బంధువులు కావడంతో ఈమెను హీరోయిన్ గా తీసుకున్నట్టు సమాచారం. రాజమౌళి సోదరుడు MM కీరవాణి ఆమె దగ్గర బంధువు కూడా కావడంతో ఈ చిత్రంతో పాటు అంతకుముందు వచ్చిన మగధీర సినిమాలో కూడా ఈమెకు ఒక చిన్న అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది రాజమౌళి.
అయితే అలా వచ్చిన సక్సెస్ ని సలోని ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయింది. ఈ సినిమాల తర్వాత సలోని రెమ్యూనరేషన్ పెంచడం వల్ల ఈమెకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో మెల్లమెల్లగా ఇండస్ట్రీ నుంచి దూరమైందని సమాచారం. ఇక ప్రస్తుతం రాజమౌళి సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబుతో ఒక అడ్వెంచర్ మూవీని చేయబోతున్నట్లుగా గడిచిన కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరిలో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించబోతున్నారు.