అమ్మ బాబోయ్.‌.అక్కినేని నాగేశ్వరరావు ” మాయాబజార్ ” మూవీ విషయంలో అలా ఆలోచించారా…!!

అక్కినేని నాగేశ్వరరావు మనందరికీ సుపరిచితమే. ఈయన అనేక సినిమాలలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అక్కినేని ఎన్టీఆర్ సినిమాలు తీస్తున్న సమయంలో ఆ సినిమా కోటి రూపాయలు దాటితే అది చాలా పెద్ద సంచలనం. కె.వి రెడ్డి మాయాబజార్ అనే సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. దీనిని నాగిరెడ్డి, చక్రపాణిలు కలిసి నిర్మాణం చేశారు. మాయాబజార్ స్క్రిప్ట్ వాళ్లకి చాలా బాగా నచ్చింది. దాంతో స్క్రిప్ట్ కి సంబంధించిన బడ్జెట్ ని కూడా వెయ్యమని చెప్పేశారు.

పింగళితో కలిసి కె.వి.రెడ్డి ఆ సినిమా బడ్జెట్ ని పూర్తి చేసి ప్రొడ్యూసర్ వద్దకు తీసుకెళ్లడం జరిగింది. కె.వి. రెడ్డి మాయాబజార్ సినిమాకి 24 లక్షల బడ్జెట్ అవుతుందని చెప్పారు కానీ అప్పట్లో 24 లక్షలు అంటే ఎంతో పెద్ద అమౌంట్. అప్పట్లో ఐదు లక్షల కి మించి సినిమాని తీసేవారు కాదు. అభిమన్నుని పాత్ర కోసం అక్కినేని నాగేశ్వరరావుని అనుకున్నారు. బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో నాగిరెడ్డి సినిమాని కొన్నేళ్లపాటు పోస్ట్ పోన్ చేశాడు.

ఇక అక్కినేని నాగేశ్వరరావు సామాన్యుడు కాదు కదా? అందుకే తమిళ్ నిర్మాత తో కలిసి సినిమా చేయాలని అతనిని కలిశారు. అక్కడ ఏం జరిగిందో కానీ ఆ నిర్మాతతో నాగిరెడ్డికి ఫోన్ చేయించి.. మాయాబజార్ సినిమాకి ఇచ్చిన అడ్వాన్స్ కూడా అక్కినేని తిరిగి ఇవ్వాలనుకుంటున్నాడు. నాతో కలిసి సినిమా చేస్తానన్నాడని చెప్పేశారు. ఇక లాభం లేదని నాగిరెడ్డి చక్రపాణి సినిమాని మొదలు పెట్టారు. సినిమా పెద్ద హిట్ అయింది. దీంతో వారు అనుకున్న కలెక్షన్స్ కంటే పెద్ద ఎత్తున వచ్చాయి.