ప్రభాస్ – శ్రీను మధ్య ఉన్న స్నేహం అదేనా…. బయటపడ్డ అసలు గుట్టు…!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు స్నేహితులుగా ఉంటారా? అంటే కొన్ని కొన్ని పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ఇక అటువంటి వారి స్నేహాలు కనిపించాలంటే మొన్నీమధ్య రామ్ చరణ్ ఇంట్లో జరిగిన ఫంక్షన్ పిక్స్ ని చూస్తే చాలు. ఇక స్టార్ హీరో, ఓ కమెడియన్ స్నేహితులుగా ఉంటారా అని ప్రశ్నిస్తే… తప్పకుండా ప్రభాస్, శ్రీను గురించి తెలుసుకోవాలి. ఇద్దరి స్నేహం చాలా అద్భుతంగా ఉంటుంది అంటుంటారు టాలీవుడ్ ప్రేక్షకులు. ఇక ఇటీవలే శ్రీను మీడియాతో మాట్లాడుతూ తమ స్నేహం గురించి వెల్లడించాడు.

ప్రభాస్, శ్రీను ఎప్పటినుంచో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అట. ఇందువల్లే శ్రీను కాస్త ప్రభాస్ శ్రీను అయ్యాడు. ఇక ఈయన మీడియాకు వచ్చిన ఇంటర్వ్యూలో మీకు ఏమన్నా ప్రభాస్ సలహాలు ఇస్తాడా అని శ్రీనును అడిగితే.. అస్సలు ఇవ్వడు అంటూ మొహమాటం లేకుండా చెప్పేశాడు. అంతేకాకుండా ప్రభాస్కు తనలో కొన్ని అలవాట్లు నచ్చకపోవడంతో శ్రీను ఆ అలవాట్లను సైతం మార్చుకున్నాను అని తెలిపాడు.

మరి ఇతరుల మాట విని మీపై ప్రభాస్ కోప్పడిన సందర్భాలు ఉన్నాయా? అని ప్రశ్నించగా… తమ మధ్య అలాంటి పరిస్థితి ఇప్పటివరకు రాలేదని తెలిపాడు. ఇక ఈ ఇద్దరూ స్నేహితులు కలిసి అనేక సినిమాలలో సైతం నటించారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక దీని బట్టి చూసుకుంటే వీరిద్దరూ ఎంత మంచి స్నేహితులు మనందరికీ అర్థమవుతుంది. ఒక స్టార్ హీరో అయ్యుండి.. కమెడియన్ తో ఫ్రెండ్షిప్ చేయడం చాలా గ్రేట్ అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.