టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మల్టీ స్టారర్ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది . ఒకప్పుడు ఒక హీరో నటించిన సినిమాకి మరొక హీరో హెల్ప్ చేయాలి ..అంటేనే తెగ బాధ పడిపోయేవారు . కానీ ఇప్పుడు మాత్రం ఒక హీరోతో కలిసి మరొక హీరో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కిన ఆచార్య సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి .
వీళ్ళ కాంబోలో ఆచార్య కంటే ముందే ఓ సినిమా రావాల్సింది. ఆ సినిమా మరేదో కాదు మగధీర . రాజమౌళి ఈ సినిమాలో చిరంజీవి కోసం ఓ స్పెషల్ పాత్రను రాసుకున్నారట . కానీ చిరంజీవి అప్పటికే సినిమాలో నటించను అంటూ ప్రకటించేశారు . ఇక చేసేది ఏమీ లేక ఆ పాత్రను తగ్గిస్తూ చిన్న క్లిప్ గా చేసి బంగారు కోడిపెట్ట సాంగ్లో యాడ్ చేశారు .
ఒకవేళ చిరంజీవి ఒప్పుకొని ఉంటే అప్పుడే వీళ్ళ కాంబో తెరపై కనిపించేది . ఆ సినిమా మెగా అభిమానులకు చిరకాలం గుర్తుండిపోయేది. మంచి సినిమాని మిస్ చేసుకున్నాడు చిరంజీవి. ఆ తరువాత పలు సినిమాల్లో వీళ్లు కనిపించినప్పటికి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు..!!