ఇండియా వరల్డ్ కప్ గెలవాలంటే మహేశ్ బాబు అలా చేయాల్సిందే.. ఫ్యాన్స్ కొత్త డిమాండ్ మామూలుగా లేదుగా..!!

మరి కొద్ది గంటల్లోనే ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ జరగబోతుంది . కోట్లాదిమంది అభిమానులు ఎంతో ఈగర్ గా ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు . ఈరోజు తో వరల్డ్ కప్ 2023 కప్ ఇండియా కా..? ఆస్ట్రేలియా కా..? తేలిపోబోతుంది. కాగా ఈ ఫైనల్ మ్యాచ్ చూడడానికి ఇప్పటికే అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంకి పలువురు స్టార్ సెలబ్రెటీస్ చేరుకున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోస్ ..టాలీవుడ్ హీరోలు.. పలువురు పొలిటిషియన్స్ కూడా ఈ మ్యాచ్ డైరెక్ట్ గా వీక్షించేందుకు అహ్మదాబాద్ చేరుకున్నారు . అంతేకాదు మాజీ టీమిండియా కెప్టెన్ సైతం ఈ మ్యాచ్ ను లైవ్ లో వీక్షించడానికి అహ్మదాబాద్ చేరుకున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో ఘట్టమనేని ఫ్యాన్స్ సరికొత్త న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు.

2011 ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ కి మహేష్ బాబు వచ్చారని ఆ కారణంగానే ఇండియా వరల్డ్ కప్ అందుకుంది అని .. ఈసారి కూడా ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ కి మహేష్ బాబు వస్తే కచ్చితంగా ఇండియా కప్పు గెలుస్తుంది అని మహేష్ బాబు ఎలాగైనా సరే ఈ ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్ చూడటానికి రావాలి అంటూ సజెస్ట్ చేస్తున్నారు. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . కొంతమంది దీనిపై వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు . మహేష్ బాబు వస్తే విన్ అవుతారు మహేష్ బాబు రాకపోతే ఓడిపోతారు కాదు.. టీం ఇండియా బాగా ఆడుతుంది ..ఇవాళ కూడా బాగా ఆడితే కచ్చితంగా కప్పు గెలుస్తారు అంటూ స్ట్రాంగ్ గా కౌంటర్స్ వేస్తున్నారు..!