బుల్లితెర నటి మహేశ్వరివి అలాంటి ఫొటోస్ వైరల్…!!

సినిమాలలో నటించే వారి కంటే.. సీరియల్స్ లో నటించే వారే ఎక్కువ ఫేమస్ అవుతూ ఉంటారు. సినిమా అయితే సంవత్సరానికి ఒక్కసారే కనిపిస్తారు. అదే సీరియల్ అయితే వారంలో ఆరు రోజులు కనిపిస్తూ ఉంటారు. అందుకే వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మామూలుగా ఉండదు. ఈ నేపథ్యానికి చెందినదే మహేశ్వరి కూడా. తన పాత్రలో జీవిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది మహేశ్వరి.

ఇక ఈ ముద్దుగుమ్మ ” పెళ్లినాటి ప్రమాణాలు ” అనే సీరియల్లో లక్షణంగా నటిస్తూ బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే బుల్లితెర స్టార్ అనిపించుకుంది. ఇక ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్నటువంటి ” నిండు నూరేళ్ల సావాసం ” సీరియల్ లో విలన్ పాత్ర పోషిస్తుంది. ఇక ఈమెకి పెళ్లయిన సంగతి తెలిసిందే.

ఈమె భర్త పేరు శివ నాగ్. వీరికి ఓ పాప కూడా ఉంది. పాప పేరు హరిణి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలో మహేశ్వరి బేబీ బంప్ తో కనిపించింది. ఈ ఫోటోలను చూసిన ప్రేక్షకులు ఈమెకి కంగ్రాట్స్ చెబుతూ ఆశీర్వదిస్తున్నారు. ప్రస్తుతం ఈమె బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.