డిమాండ్ చేయడంతో కాజల్ ప్లేస్ లో శ్రీ లీల పిక్స్..!!

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది స్టార్ హీరోలతో కోలీవుడ్ టాలీవుడ్ లో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. తన కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా మొదలుపెట్టి భారీగానే సినిమాలలో నటిస్తోంది. భగవంత్ కేసరి సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తన తదుపరి చిత్రం లేడీ ఓరియంటెడ్ మూవీ అయినా సత్యభామ సినిమాలో నటిస్తోంది.

అలాగే కమలహాసన్ తో కలిసి ఇండియన్-2 చిత్రంలో కూడా నటిస్తోంది.ఇవే కాకుండా పలు రకాల బ్రాండ్లకు కూడా అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న కాజల్ అగర్వాల్ పలు రకాల షాపింగ్ మాల్స్ ఓపెనింగ్కు కూడా హాజరవుతూ తెగ సందడి చేస్తూ ఉంటుంది. అయితే వీటికి భారీగానే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ హైదరాబాద్ కి చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ తమ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం సంప్రదించగా ఈమె ఏకంగా 15 లక్షలు డిమాండ్ చేసిందట.

ఇలా గంట కార్యక్రమానికి అన్ని లక్షల అంటూ ఆశ్చర్యపోతున్నారు.. వీటితోపాటు వచ్చి పోవడానికి ఫ్లైట్ టికెట్స్ అలాగే హోటల్ బిల్లు కూడా ఆ సంస్థ వారే భరించాల్సి ఉంటుందట. కేవలం గంట కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఈ ఆఫర్ ను సైతం శ్రీలీలకు ఇవ్వడం జరిగిందట ఆ రియల్ ఎస్టేట్ సంస్థ.ఇమే కేవలం 12 లక్షలకే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హైదరాబాదులోనే ఉండడం వల్ల ఈమె వచ్చి పోవడానికి కూడా ఖర్చులు ఇవ్వాల్సిన పనిలేదని కాజల్ ప్లేస్ లో తీసుకున్నట్లు తెలుస్తోంది.