ఇటీవల కాలంలో కోటి రూపాయల రెమ్యూనరేషన్ అంటే చాలా తక్కువ. హీరోయిన్‌లు కూడా రెండు మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మిడిల్ రేంజ్ హీరోలు ఎనిమిది కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మాస్ మహారాజ్ రవితేజ రూ.10 కోట్లపైన డిమాండ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు రూ.50 కోట్లకు పైగా పారితోషికాన్ని తీసుకుంటున్నారు. ప్రభాస్ ఐతే ఏకంగా రూ.100 కోట్ల మార్క్ వరకు వచ్చేసాడు. అయితే ఒకప్పటి రోజుల్లో లక్షల్లోనే రెమ్యూనరేషన్ ఉండేది.
ఇక అప్పట్లో టాలీవుడ్ లో కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరో ఎవరో చూద్దాం. దాదాపు టాలీవుడ్ లో కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న మొదటి హీరో అంటే చిరంజీవి అని అందరు భావిస్తారు. ఇక గతంలో ఓ మ్యాగ్జన్లో చిరంజీవి పై ఓ వార్త కూడా వచ్చింది. 1992లో రిలీజ్ అయిన ఘరానా మొగుడు సినిమాకి చిరంజీవి కోటి రూపాయల రమ్యునరేషన్ తీసుకున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. కానీ వాస్తవానికి కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న మొదటి హీరో చిరంజీవి కాదట.. ఆయన ఎవరో కాదు నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. మేజర్ చంద్రకాంత్ సినిమాకి ఆయన కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నాడు. 1993లో ఈ సినిమా రిలీజ్ అయింది.
కానీ ఈ సినిమా కంటే ముందే ఘరానా మొగుడు రిలీజ్ అయింది. టెక్నికల్ ఇష్యూస్‌తో మేజర్ చంద్రకాంత్ డిలే అయ్యింది. దీంతో చిరంజీవి మొదటి కోటి రూపాయలు హీరో అని అంతా భావిస్తారు. వాస్తవానికి ఎన్టీఆర్ మొదట కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఈ సినిమా అప్పటికి పూర్తయిపోయింది కూడా. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ తో పాటు అమితాబ్ రికార్డులను కూడా బద్దలు కొడుతూ చిరంజీవి రూ.1.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నాడు. మనదేశం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఎన్టీఆర్ ఈ సినిమాకి రూ.200 మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అది తర్వాత రూ.50వేలు, టాప్ హీరో అయ్యాక లక్ష రూపాయలు పారితోషికం అందుకున్నాడు.

ఒక లక్ష రూపాయల రెమ్యూనరేషన్‌కి 10 ఏళ్ల వరకు ఎన్టీఆర్ ఎదురు చూశాడు. తర్వాత అదే రెమ్యూనరేషన్ చాలా కాలం కంటిన్యూ అయింది. ఎన్టీఆర్ నిర్మాతల, దర్శకుల హీరో అని చాలామంది సినీ ప్రముఖులు చెబుతూ ఉంటారు. ఈ కారణంగానే ఎన్టీఆర్ చాలా కాలం వరకు అదే రెమ్యూనరేషన్‌ను కంటిన్యూ చేశారు. అలాంటి ఎన్టీఆర్ కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే ఆయనకు అప్పట్లో ఎటువంటి పాపులారిటీ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇక వాస్తవానికి హీరోల పారితోషికం పెంచడం హీరోలకు అలవాటైనది కాదు. నిర్మాతలే వాళ్ళకి అలవాటు చేశారు. రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చి ఎలాగైనా వాళ్ళ ప్రాజెక్టు ఓకే చేయించుకున్నవారట.