ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే.. వాళ్లకు 100 కోట్ల సహాయం చేస్తా: ఆస్ట్రోటిక్ సీఈవో పునీత్

ప్రస్తుతం ఇండియా అంతా క్రికెట్ మానియా న‌డుస్తుంది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ రసవత్తరంగా సాగుతున్నాయి. ఇందులో టీమిండియా కప్ గెలిస్తే రూ.100 కోట్లు పంపిణీ చేస్తామని ఆస్ట్రోటెక్ సీఈవో పునీత్ గుప్తా సెన్సేషనల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఐసిసి వన్డే వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. దీనికి ముఖ్యఅతిథిగా నరేంద్ర మోడీ కూడా హాజరుకానున్నాడు.

ఇక ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు సిద్ధమయ్యాయి. అహ్మదాబాద్ స్టేడియం చేరుకున్నాయి. రేపటి మ్యాచ్ కోసం ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఈ టీమ్స్ ఈ క్రమంలో భారత్ వరల్డ్ కప్ గెలిస్తే తన యూజర్లకు రూ.100 కోట్ల సహాయం చేస్తానని ఆస్ట్రోటెక్ సీఈవో పునీత్ గుప్తా ప్రకటించాడు. ఆస్ట్రేలియా – టీమ్‌ ఇండియా పోరులో ఫైనల్ లో టీమ్‌ ఇండియా గెలవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశాడు.

2011లో మనం వరల్డ్ కప్ గెలిచాం. అప్పుడు నేను కాలేజీలో చదువుతున్నాను. నా జీవితంలో అత్యంత ఆనందకరమైన నిమిషాలు అవే అంటూ పునీత్ చెప్పుకొచ్చాడు. ఈసారి ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే నా కంపెనీ యూజర్లతో ఆనందాన్ని షేర్ చేసుకుంటా అంటూ వివరించాడు. కాగా రేపటి మ్యాచ్లో టాస్ మొదట గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే ఆస్ట్రేలియా టీమ్‌ కంటే ముందు టీమిండియా కు చాలా అడ్వాంటేజ్ ఉన్నాయ‌ట‌. ఇక ఇప్పటికే ఈసారి టీమిండియా గెలుస్తుంది అంటూ చాలామంది సినీ సెలబ్రిటీస్ కూడా తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.