పెళ్లి తర్వాత మొదటిసారి భర్తపై అలాంటి పోస్ట్ చేసిన లావణ్య త్రిపాఠి..!!

దాదాపుగా ఆరు సంవత్సరాల క్రితం నుంచి ప్రేమించుకుని ఈ ఏడాది నవంబర్ 1వ తేదీన వివాహ బంధంతో ఒక్కటయ్యారు మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి.. తాజాగా ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడం జరిగింది. దీంతో ఇరువురు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది. పెళ్లి తర్వాత హైదరాబాద్ డెహ్రాడూన్ లో కూడా రిసెప్షన్ ని మొదలుపెట్టడం జరిగింది. దీపావళి వేడుకలలో లావణ్య త్రిపాఠి తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా తన భర్త వరుణ్ తేజ్ పైన పలు విషయాలను తెలియజేయడం జరిగింది.

తన పెళ్లి వేడుకలోనే పలు విషయాలను ఇంట్రెస్టింగ్ ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది ఈ ముద్దుగుమ్మ.. నాకు తెలిసి అత్యంత అద్భుతమైన దయగల కెరియర్ ఉన్న వ్యక్తి నా భర్తగా రావడం నా అదృష్టం ఇంకా తన గురించి చెప్పడానికి చాలానే ఉంది. కానీ వాటన్నిటిని తన మనసులోనే దాచుకుంటాను మా కుటుంబాలు ప్రియమైన వారి మధ్య మూడు రోజుల పెళ్లి చాలా ఘనంగా జరగడంతో నా కల నెరవేరింది.ఈ రోజును చాలా ప్రత్యేకంగా చేసిన ప్రతి ఒక్కరికి మాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అంటూ తమ పెళ్లి ఫోటోలను షేర్ చేయడం జరిగింది.

లావణ్య త్రిపాఠి పోస్టులకు సైతం తన భర్త వరుణ్ తేజ్ లవ్ ఎమోజిని సైతం షేర్ చేశారు. లావణ్య త్రిపాఠి షేర్ చేసిన ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారడంతో అభిమానులు సైతం వీరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. 2017లో విడుదలైన మిస్టర్ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలై ఆ తర్వాత వివాహ బంధంతో ఒకటయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by Lavanya tripathi (@itsmelavanya)